కుల భందువులారా, ఒక్క సారి, ST సాధనలో సాటి బోయ సోదరుల ఐకమత్యం మరియు పోరాట పటిమ చూడండి👌
వారికి ST పోరాటంలో ఉన్న క్లారిటీ ని ఒక్క సారి గమనించండి. వారి ST సాధన సెగ ఢిల్లీకి తాకింది . హస్తిన నుండి అమరావతి కి వివరణల లెటర్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. ఇవన్నీ బోయ సోదరులు నిర్భయంగా ఫెస్బుక్ లో కూడా చర్చిస్తున్నారు. ఎవరు ST పోరాటానికి, మద్దతు తెలపక పోయినా కౌన్సిల్ చేస్తున్నారు లేదా దూరం పెడుతున్నారు
బోయ సోదరుల కంటే సంఖ్యా పరంగా ఎక్కువ ఉన్న మనం, దురదృష్టం వశాత్తూ ...
1. మనలో కొంత మంది, గాడి తప్పిన యువత ఇంకా, గతంలో బ్రతుకుతూ, గజాపతులూ/సూర్యవంశాలూ/ప్రభాసులూ/మాహిష్మతులూ అనుకుంటూ, ST రిజర్వేషన్ వద్దూ అంటూ ఫేస్బుక్ లో సైతం హెచ్చరిస్తున్నారు
2. బోయ సోదరుల సంఘాల్లో, JAC ల్లో DNT/MBC వాదనలు వినిపిస్తే తీవ్ర ప్రతిఘటనలు. ఇక్కడ ఒక రాష్ట్ర వడ్డెర JAC పూర్తిగా MBC ఉద్యమ JAC గా మారి పోయింది! కనీసం, ప్రశ్నించే వారు కూడా లేరు
3. మేధావులు సైతం, MBC వల్ల ఒరిగే, తాత్కాలిక, అల్పసంఖ్యాక పదవుల లేదా ఆర్ధిక లబ్ది భ్రమలో పడి, MBC లిస్టు లో లేక పోతే, భవిష్యత్తు లేదు అని ప్రచారం చేయడం దౌర్భాగ్యం
4. సందు దొరికితే చాలు, అపర రాబిన్ హుడ్ల వలే, నోమాడిక్ ట్రైబ్స్ అన్నింటినీ, రాజ్యాంగ నిబద్ధత లేని DNT బిల్లుతో మార్చేస్తాం, అనే నాయకులు, ఎక్కువ శాతం మన కులం వారు కావడం ఇంకో దౌర్భాగ్యం
5. బోయ సోదరులు కుల వృత్తులను సైతం తాత్కాలికంగా పక్కన పెట్టి ST సాధన అంటూవుంటే, మన లో కొందరు కేవలం, లోన్లూ, తట్టలూ, కార్పొరేషన్లు, BC పధకాలూ అంటూ, BC లో పాతుకు పోవాలి అనుకుంటున్నారు
6. కొందరు మేధావులు, "ST రాదు!" అంటారు. " మనకు ఇస్తే, ST లు ఊరు కోరు" అని ఇంకొందరు. " BC ని వాడుకోవడం చేతకాని మనకు, ST ఎందుకు?" అని ఇంకొందరు! "విద్య నేర్పితే చాలు!" అని కొందరు! లేబర్ పని చేసే, OC లకు కూడా ఇచ్చే, లేబర్కార్డులు ఇస్తే చాలు, మనం రాయి పనే, చేసుకుంటూ ఉందాం, అనుకునే వారు, మరికొందరు!
7. బోయ సోదరులు, ఇరు తెలుగు రాష్ట్రాల వారిని కలుపుకొని KCR గారికి, CBN గారికి, ST సాధనకై, కలిసి సెగ పెడుతుంటే, మన వారు, ఇంకా, మా రాష్ట్రం వేరు, మీ రాష్ట్రం వేరు అనుకుంటున్నారు.
ఇలా ఇన్ని ప్రతికూలాలు, కులం లోపలే ఉంటే, ST సాధనలో, క్లారిటీ కొరవడతుందనేదే నా అభిప్రాయం😢
ప్లీస్! ఆలోచించండి! 🙏🙏🙏🙏🙏 ( ఎవరికైనా బోయల ST పోరాటం తాలూకు ఢిల్లీ to అమరావతి కమ్యూనికేషన్ లేటెస్ట్ అప్డేట్ కావాలంటే నన్ను సంప్రదించండి. I can post them as personal messages)
ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది