Skip to main content
దయచేసి వేచివుండండి...
Submitted by vsss on 21, Nov 2018

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ 2018 ఎలక్షన్ మానిఫెస్టో pdf విడుదల చేసింది.

అగ్ర బీసీ కులాలకు పెద్ద పీట వేసి, 30 నుండి 40 లక్షల తెలంగాణ వడ్డెర్ల ST డిమాండును స్పష్టం గా రాయక పోవడం బాధాకరం! 

అయితే, "గుర్తింపుకు నోచుకోని, సంచార జాతులను గుర్తించి, అర్హత గల జాబితాలో చేరుస్తాం!" అని చెప్పడం కొంత మన ST వాదానికి ఊరట కలిగించేదే!

రాహుల్ గాంధీ వడ్డెర్లను ST లో చేరుస్తామని ఇచ్చిన హామీని కూడా నిర్వీర్యం చేయగల సత్తా, కొందరు మన తెలంగాణా వడ్డెర నాయకులకు ఉన్నట్టుంది!

ఎందుకంటే, సగటు వడ్డెర్ల ST డిమాండ్ ను, పక్కన పెట్టి, పదవుల వంటి తాయిలాలకు ఆశ పడి, గత నెలలో కొందరు నాయకులు కాంగ్రెస్ ముందు కూడా కులాన్ని తాకట్టు పెట్టారు కాబట్టే, కాంగ్రెస్ వారు మన ST డిమాండును మానిఫెస్టో లో స్పష్టం గా పెట్టలేదు అనిపిస్తోంది.  ఇలాంటి నాయకులే, గతం లో TRS దగ్గర బిస్కెట్ల కు ఆశ పడ్డారు కాబట్టి, వారి pdf లో కూడా మన ST డిమాండు కనిపించే అవకాశాలు తక్కువే అనిపిస్తోంది.

అయినప్పటికీ, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారి వరకు తీసుకు వెళ్లాల్సిందే! ఆ ప్రయత్నాన్ని, వారి పార్టీకి మద్దతు తెలుపుతూనే, చేయాలని అనుకుంటున్నాను. 

వారి నాయకుడు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, TRS వారి pdf లో ఇప్పుడు, వడ్డెర్ల ST డిమాండ్ కోసం వెతకాలి. BJP వారు, లక్షల వడ్డెర్ల ST ఆకాంక్ష ను విస్మరించినట్లే కనిపిస్తోంది!(BJP పూర్తి మేనిఫెస్టో pdf నాకు ఇంకా దొరకలేదు) హైందవులు గా BJP కి ఓటు వేసే లక్షల వడ్డెర్లు, ఈ అలసత్వానికి తగిన బుద్ధి చెప్పవలసిందే అని, నేను భావిస్తున్నాను!

ఇలా ప్రశ్నించకుండా, ఎన్నికల ముందు, నాయకులు/పార్టీలు పడేసే బిస్కెట్లకు లేదా పదవులకు ఆశ పడితే, మరో 5 నెలల్లో వస్తున్న పెద్ద ఎన్నికల్లో కూడా, వడ్డెర్ల కోర్ డిమాండ్, ST ని విస్మరిస్తారని గమనించి, మనం ఏక కంఠం తో, "మాకు ST ఇవ్వగలిగిన పార్టీలకు మాత్రమే, ఓట్లు వేస్తాం!" అని గట్టిగా చెప్పాలి!

జై వడ్డెర

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789-368-2052