Skip to main content
దయచేసి వేచివుండండి...

వడ్డెర్ల దుర్భర సాంఘిక జీవితంలో ఎన్ని విష సర్పాలో?

Submitted by vsss on 11, Mar 2019

ఈ వీడియో లో మీరు చూసే ఈ ఘటన, హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో నేను చూసిన, వడ్డెర్ల ప్రాణాపాయ వృత్తి లోని ఒక  కోణం మాత్రమే!

వందల సంవత్సరాలుగా మన రక్త మాంసాలతో భారతావని కట్టడాలు నిర్మించుకుని, పాలకుల నిర్లక్ష్యం వల్ల మన ST హక్కును, తద్వారా మన సాంఘిక ఉనికిని కోల్పోయి, అనుభవిస్తున్న దుర్భర జీవతంలో పామును చూసి భయపడే పరిస్థితి లేదు నాకు అనిపిస్తుంది!

ఇది తెలియని లేదా తెలిసి నటిస్తున్న పాలకులు మరియు కొందరు కుల నాయకులు, మన కుల వృత్తిని ఇతర కుల వృత్తులతో పోల్చి, వారి స్వార్ధానికి వాడుకోవడం శోచనీయం!

VSSS, వడ్డెర్లకు ST సాధనలో ఎలా సహకరిస్తుంది?

Submitted by vsss on 11, Mar 2019

18 నెలల వ్యవధిలో, మూడు దశలలో, వడ్డెర్లకు ST సాధించే ప్రణాళికను VSSS సిద్ధం చేసింది. ముందుగా లక్ష డిజిటల్ ఆన్లైన్ ST పిటీషన్లు సిద్ధం చేసుకుని, పిదప MP లను MLA లకు మన ST హక్కు వివరించాలి. చివరగా, ఢిల్లీ లో ప్రజాస్వామ్య పోరాటం చేసి ST సాధించే విధంగా రూపొందించిన కార్యాచరణ ను అమలుపరుస్తుంది .

ఈ ప్రణాళిక వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి

తెలుగు వడ్డెర్లు ST పతాక పోరు ఎక్కడ చేయాలి

Submitted by vsss on 11, Mar 2019

రాజ్యాంగ వాస్తవాల దృష్ట్యా, తెలుగు వడ్డెర్ల ST పోరు , దేశ రాజధాని ఢిల్లీలొనే చేయవలసిన అవసరం ఉంది.
ఢిల్లీ లో మనము చేయబోయే ప్రజాస్వామిక పోరు గురించిన కొన్ని వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి

తెలుగు వడ్డెర్లు ST పోరు ఎప్పుడు చేయాలి

Submitted by vsss on 11, Mar 2019

తెలుగు వడ్డెర్లు ST పోరును 2019 లో తీవ్రతరం చేయాలి.

ఎందుకు ఈ సమయంలో పోరును తీవ్రతరం చేయాలో తెలిపే వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052

తెలుగు వడ్డెర్లు ST కోసమే ఎందుకు పోరాడాలి?

Submitted by vsss on 11, Mar 2019

తెలుగు వడ్డెర్లకు చేజారిన ST హక్కును వివరిస్తూ, ఇప్పుడు మన ST పోరాటాన్ని నీరుకారుస్తున్న MBC/DNT వాదాలు, వడ్డెర్లకు ఎంత వరకు పనికొస్తాయో కూడా, వివరించడం జరిగింది. 
మనం ST పోరు ఎందుకు చేయాలో తెలియజేసే వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052

వడ్డెర్లను అసాధ్యమైన DNT పోరు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు

Submitted by vsss on 3, Mar 2019

ఈ రోజు(3-3-2019), హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించి, కొందరు వడ్డెర నాయకులు, సంచార జాతుల మేధావులతో కలసి వడ్డెర్లను, అసాధ్యమైన DNT పోరు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా వెళ్లి, వడ్డెర్లకు ST అవసరం, అర్హతలు గురించి మరియ DNT పోరు అసాధ్యాల గురుంచి వివరించాలనుకున్నాను. కానీ నిర్వాహకులు నాకు, నో ఎంట్రీ బోర్డు పెట్టారు! అందుకే, సోషల్ మీడియా ద్వారా, నా ST వాదనను మరియు ఇతర DNT మేధావులకు నా విన్నపాన్ని తెలియ చేస్తున్నాను. వీడియో తో పాటు సదస్సు వివరాలను కూడా క్రింద ఇస్తున్నాను. గమనిక: మీరు కూడా ఈ వీడియోను మన వడ్డెర సోదరులకే కాదు, ఈ DNT మేధావులకు కూడా చేరే విధముగా షేర్ చేయగలరు.

వడ్డెర్ల ST సాధన సమితి మొదటి ఫేస్ బుక్ లైవ్ ప్రోగ్రాం

Submitted by vsss on 15, Dec 2018
డిసెంబర్ 5 వ తేదీ సాయంత్రం నేను మొదటి సారి, 'వడ్డెర్ల ST సాధన సమితి' ప్రెసిడెంట్ హోదాలో, ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రాం చేశాను. స్పందన బాగుంది. చాలా మంది, చాలా ప్రశ్నలు అడిగారు. ST సాధన విషయంలో కులం లో ఉన్న అనుమానాలు మరియు మన కులం లో ఉన్న ఇతర సమస్యలపై కూడా అడిగిన వారి ప్రశ్నలకు, సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే, అనేక కారణాల వల్ల కొందరు లైవ్ ప్రోగ్రాం వీక్షించలేక పోయారు. వారి కోసం, ఈ వీడియో, యూట్యూబ్ లో పెట్టి, లింకు ఇక్కడ ఇస్తున్నాను. నోట్: మొత్తం గంట వీడియో ను యధావిధంగా పోస్ట్ చేస్తున్నాను. పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి వడ్డెర్ల ST సాధన సమితి

చంద్రకళ తన తల్లి మరణ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు

Submitted by Orsu Srinivasa… on 12, Dec 2018

 

2012 లో ఆమె తల్లి మరణించిన తేదీని కనుగొన్నప్పటి నుండి, జె. లక్ష్మి దేవి గారు యొక్క కుమార్తె అయిన డాక్టర్ J. చంద్రకళా సెప్టెంబర్ 21 న ప్రతి సంవత్సరం తన తల్లి మరణ వార్షికోత్సవాన్ని జ్ఞాపకార్థించారు. అన్నదానం (పేదవారికి భోజన స్పాన్సర్షిప్), పాఠశాల స్థిర పంపిణీ, పాఠశాల ఫర్నిచర్ విరాళాలు (విద్యార్థులకు బల్లలు) ఆమె తల్లి పేరు మీద చేపట్టారు. డాక్టర్ జరీపేటి చంద్రకళా కల్లూర్ గ్రామంలోని బలమైన కమ్యూనిటీకి మరియు ZPHS సిబ్బంది సభ్యులకు కృతజ్ఞుడైనది

Subscribe to President's Videos