- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
ఈ రోజు(3-3-2019), హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించి, కొందరు వడ్డెర నాయకులు, సంచార జాతుల మేధావులతో కలసి వడ్డెర్లను, అసాధ్యమైన DNT పోరు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా వెళ్లి, వడ్డెర్లకు ST అవసరం, అర్హతలు గురించి మరియ DNT పోరు అసాధ్యాల గురుంచి వివరించాలనుకున్నాను. కానీ నిర్వాహకులు నాకు, నో ఎంట్రీ బోర్డు పెట్టారు! అందుకే, సోషల్ మీడియా ద్వారా, నా ST వాదనను మరియు ఇతర DNT మేధావులకు నా విన్నపాన్ని తెలియ చేస్తున్నాను. వీడియో తో పాటు సదస్సు వివరాలను కూడా క్రింద ఇస్తున్నాను. గమనిక: మీరు కూడా ఈ వీడియోను మన వడ్డెర సోదరులకే కాదు, ఈ DNT మేధావులకు కూడా చేరే విధముగా షేర్ చేయగలరు. అలాగే, సమయం లేక పోవడం వల్ల, రాత్రి చేసిన ఈ వీడియోలో, తప్పులు దొర్లితే పెద్ద మనసుతో క్షమించగలరు.
మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి వడ్డెర్ల ST సాధన సమితి 789 368 2052
(దండి వెంకట్ గారు పోస్ట్ చేసిన సమావేశ వివరాలు)
మార్చ్ 3న హైదరాబాద్ లో DNT సంచారజాతుల రాష్ట్ర నాయకుల సమావేశం... తేదీ 3-3-2019న ఆదివారం ఉదయం 11 గంటలకు హోటల్ సాద్విక మియాపూర్ సినీ టౌన్ దగ్గర హైదరాబాద్ లో ఉంటుంది.. ప్రియమైన డిఎన్టీ సంచారజాతుల మేధావులు, విద్యావంతులు,వివిధ సంచారజాతుల సంఘాల నాయకుల పాల్గొంటారు... కావున ఈ సమావేశానికి బహుజన మేధావులు ప్రొఫెసర్ ఐ.తిరుమలి, (ఊసా) ఊ సాంబశివరావు గార్లు హజరవుతున్నారు.. *ఇట్లు అభినందనలతో..* జరిపేటి రాములు, వై.వెంకటనారయణ, ఒంటెద్దు నరేందర్, దండి వెంకట్ పల్లపు సమయ్య DNT సంచారజాతుల సంఘం రాష్ట్ర నాయకులు