Skip to main content
దయచేసి వేచివుండండి...

గౌరవనీయులైన YSRTP పార్టీ ప్రెసిడెంట్ గారికి

గమనిక: ముందుగా ఈ విషయానికి సంబంధించిన PDF లు/ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఈ కంటెంట్ పై పూర్తి అవగాహన వస్తుంది

ఫైలు సైజు
YSRTP _మేనిఫెస్టో__VSSS_లెటర్_హెడ్_వినతి.pdf (312.07 కిబై) 312.07 కిబై
YSRTP _మేనిఫెస్టో___తెల్లకాగితం_వినతి.pdf (156.01 కిబై) 156.01 కిబై
Signatures.pdf (73.97 కిబై) 73.97 కిబై
ST_Document_telugu_pamplet_no_watermark.pdf (243.59 కిబై) 243.59 కిబై
వడ్డెర్ల_ST_డాక్యుమెంట్_తెలుగు.pdf (315.65 కిబై) 315.65 కిబై

To,

శ్రీమతి Y S షర్మిల గారు,

YSRTP పార్టీ ప్రెసిడెంట్,

YSRTP పార్టీ కార్యాలయం,

హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్రం  

 

From,

తెలంగాణ రాష్ట్ర వడ్డెరలు 

 

గౌరవనీయులైన YSRTP పార్టీ ప్రెసిడెంట్ గారికి, 

 

విషయం: పూర్తిగా వెనకబడ్డ శ్రామిక మరియు సంచార వడ్డెరల న్యాయమైన ST డిమాండ్నుYSRTP మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు మీ పార్టీ పై ఉంచిన విస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము 

 

మేడమ్  గారు, 

 

వడ్డెర మరియు వివిధ పేర్లతోభరత ఖండం అంతా విస్తరించియున్న మేముదేశంలోని కట్టాడాలన్నీమా రక్తం మరియు చెమటతో నిర్మించినఅతి పెద్ద సంచారనిర్మాణ శ్రామిక తెగలము. బ్రిటిష్ పాలనలోమమ్ములను, నేర జాతులుగా(క్రిమినల్ ట్రైబ్స్ముద్రించడం వల్లక్రమంగాసాంఘిక దోపిడీకి గురికాబడ్డాముఇలాంటి తెగలకుస్వతంత్రానంతరం, 1952 లో DNT లుగా పేరు మార్చినప్పటికీచెప్పుకోదగ్గ చేయూత లభించకమేముఅన్ని రంగాల్లో వెనకబడిపోయాము. 

 

పలు SC/ST యాక్టుల ద్వారాదేశంలోని 70% రాష్ట్రాల్లోని వడ్డెరలుఇప్పటికే SC/STలుగా గుర్తింపు పొందియున్నారు. 1976 SC/ST యాక్టువరకుఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని  ఎరుకలయానాదిలంబాడీ వంటి DNT లను, STలు గా గుర్తించిమా వడ్డెర్లను మాత్రం విస్మరించడంతో, BC లుగానే మిగిలిపోయాముఅప్పటి నుండిమా తెలుగు వడ్డెర్లు, వారికి న్యాయంగా రావలసిన ST హక్కు కోసం, పోరాడుతూనే ఉన్నారు.

 

 కులం లో లేనటువంటిశారీరక హింస మరియు ప్రాణాపాయ  ప్రమాదాలతో కూడిన వృత్తి లో ఉన్న మా వడ్డెరలకు, BC లో అందించే చేయూత చాలకవృత్తి సంబంధిత సాంఘిక సమస్యల ఊబిలో చిక్కుకు పోతున్నామువిద్యఆర్ధికఉపాధి మరియు రాజకీయ రంగాల్లో వెనకబడ్డ మేముచెప్పుకునే దిక్కులేక పోవడం వల్లసంఘంలో దాడులకు కూడా గురి అవుతున్నాము. తెలంగాణ లో ఎంతో మంది వడ్డెర యువత మీ అభిమానులుగా ఉంటూ, మీ పార్టీ వైపు కూడా అడుగులువేస్తున్నారు. మీ తండ్రి మరియు జననేతస్వర్గీయ YSR గారి కలయైన వడ్డెరల ST డిమాండును, YSRTP మ్యానిఫెస్టోలో, చేర్చవలసిందిగా అభ్యర్ధిస్తున్నాము.  

 

మా బ్రతుకులు బాగు పడాలంటే, నిర్దిష్ట వనరులు సమకూర్చి, మెరుగైన విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ తో పాటు, మాకు అట్రాసిటీ చట్ట రక్షణ కూడా ఇవ్వగల మరియు మేము న్యాయంగా ఉండవలసిన ST జాబితాలో మమ్ములను చేర్చే విధంగా, మా 43 ఏళ్లST డిమాండ్ను YSRTP మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు, మీ పార్టీ పై ఉంచిన విస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 

 

ధన్యవాదములతో, 

ఇట్లు, 

తెలంగాణ రాష్ట్ర వడ్డెరలు 

 

Note: పేరుఫోన్ నంబర్ మరియు సంతకాలతో కూడిన పత్రాలను/ST అర్హత డాక్యుమెంట్లను  విజ్ఞప్తికి జత చేస్తున్నాము.