మేడ్చల్ జిల్లా నాగారం వలస కూలీ వడ్డెర్ల వెతలు: మహిళల మాటల్లో

జంటనగరాలకు కూటవేతు దూరం లో ఉన్న ఈ మురికి వాడలో, వడ్డెర్లకు, వారి శారీరక హింస తో కూడిన కులవృత్తి వల్ల వచ్చే సాంఘిక సమస్యలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ, కట్టెల పొయ్యిలో వంట చేసుకునే వారు మరియు కనీసం రేషన్ కార్డులు కూడా లేని వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. బండ పని వల్ల దాపురించిన తాగుడు, మహిళలకు శాపంగా మారింది. లోన్లు, లేబర్ కార్డుల తోనే కులం బాగు పడుతుందనుకునే నాయకులకు, మహిళలు చాలా ప్రశ్నలు సంధించారు. వడ్డెర్లకు ST లాంటి రిజర్వేషన్ తో విద్య సంబంధిత ఉద్యోగాలు వచ్చి తమ భవిష్యత్తు మారుతుందని ఇక్కడి మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. 'మనం రాజుల' అని ఎవరైనా అన్నప్పుడు, వీరు చాలా బాధపడుతున్నారు.

అనంత జిల్లా రామాపురం లోని వడ్డెర్ల బతుకు చిత్రం

నల్లమాడ సమీపంలో ఉన్న, ఎక్కువ వడ్డెర గడపలు గల రామాపురం లో పెద్ద ట్యాంక్ ఉంది గాని, నీళ్లు లేవు. ఇక్కడ వడ్డెర బతుకుల్లో వలసలు పోగా, మిగిలిన వారికి కుల వృత్తి శాపాలు అడుగడునా దర్శనమిస్తున్నాయి. సోసిటీలు, లోన్ల పేర జరుగుతున్న కుల మోసాలను కూడా వీరు వివరించారు. వడ్డెర్ల వృత్తి వల్ల సంక్రమిస్తున్న వ్యసనాలు మరియు వాటి వల్ల సంభవించిన మరణాలు, ఇక్కడి వడ్డెర్ల సాంఘిక అధమ స్థితికి దర్పణాలు. మనకు, కులం లోని కొందరు మూర్ఖులు ఆంటగట్టిన రాజుల పోకడలను, అందరు మహిళలు, ఇక్కడ కూడా దుయ్యబట్టారు. మనతో అన్ని పనులు చేయించునే, ఈ సభ్య సమాజం, మనకు ఏదైనా పని చేయవలసి వస్తే, "వడ్డేరోడివి! నీకేం!

వడ్డెర వెలుగు ట్రస్టు వార్షికోత్సవం లో జెరిపేటి చంద్రకళ ప్రసంగం

వడ్డెరలకు అత్యంత పారదర్శకంగా సేవలు చేస్తున్న చారిటబుల్ ట్రస్టు రెండవ వార్షికోత్సవంలో నన్ను సన్మానించిన సభ్యులకు మరియు ఓర్సు లక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే, నాకు ప్రసంగించే అవకాశం ఇచ్చి, వడ్డెరుల సమస్యల పై నా విశ్లేషణ ను కూడా ఓపిక గా విన్న సభికులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

చిత్రదుర్గ లో వడ్డెర స్వామిజీ సమక్షంలో వడ్డెర టైమ్స్ వెబ్సైట్ లాంచ్

జూన్ 27, 2018 న, మన స్వామీజీ గారి ఆశీస్సులతో www.vadderatimes.com ను మన భోవి ఆశ్రమమం చిత్రదుర్గ లో వారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. అదే వేదికపై మేము చేసిన దేవాలయాల వెబ్సైట్ www.indiantemples.info కూడా ప్రారంభించడం జరిగింది. స్వామిజీ గారు కులం కోసం చాలా కష్ట పడుతున్నారు. వారిని మనమంతా గౌరవిస్తూ ప్రోత్సహించ వలసిన అవసరం ఉంది

చిత్తూరు జిల్లా జర్రావారి పల్లి వడ్డెర మహిళల, సాంఘిక సమస్యలు: వారి మాటల్లో

వాయల్పాడుకు దగ్గర లో కల ఈ వడ్డె పల్లెలోని వడ్డెర మహిళలు, ఇంటా మరియు బయట పడుతున్న, సమస్యలు అనేకం! చిన్న వయస్సులోనే పెళ్ళి, పౌష్ఠికాహార లోపం, భర్తల వ్యసనాలు, వైవాహిక సమస్యలు, మాత్రమే కాదు, వీరికి కుల వృత్తి శాపాలు కూడా ఉన్నాయి. రాయి సంబంధిత వృత్తుల్లో పులిసిపోతున్న శరీరాన్ని విశ్రమింప చేయడానికి, కొన్ని ప్రాంతాల వడ్డెరలు మద్యం సేవిస్తున్న సమస్య అందరికీ తెలిసిందే! అయితే, తెలంగాణకు భిన్నంగా, ఈ ప్రాంత మహిళలు మద్యం సేవించడం లేదు కాబట్టి, వారు మద్యం కన్నా భయంకరమైన, సమస్యలో కూరుకు పోతున్నారు.

చిత్తూరు జిల్లా వాయల్పాడు దగ్గర ఉన్న వడ్డెపల్లి యువకుల కష్టాలు

ఇక్కడి వడ్డెర యువకులు నాయకులకు చాలా ప్రశ్నలు సంధించారు. ఎంతో కష్టపడి, డిగ్రీలు చదివినా, ఉద్యోగాలు లేక తిరిగి శారీరక హింసతో కూడిన కులవృత్తుల్లోకి పోవడాన్ని చక్కగా వివరించారు. లోన్లు ఇచ్చి, ట్రాక్టర్ కొనిపిస్తే, సాంఘీక జీవన ప్రమాణాలు పెరగవు అని చెప్పుతో కొట్టినట్టు చెప్తున్నారు. పాలకుల నిర్లక్ష్యమే, వారిని ST/SC పోరాటం వైపు నడిపిస్తుందని చెప్పకనే చెప్పారు. దయచేసి ఈ వీడియో ను పూర్తిగా చూసి వడ్డెర యువత ప్రస్నలకు సమాధానాలు ఇవ్వండి.

వనపర్తి వడ్డెర మహాసభలో జెరిపేటి చంద్రకళ ప్రసంగం

పాలమూరు సోదరుల పిలుపు మేరకు, 19 జూన్ నాడు, నేను, వనపర్తి వడ్డెర మహా సభకు వెళ్లడం జరిగింది. వేముల వెంకటేష్ గారు, వడ్డెరలకిచ్చిన ST భరోసా పై నిలదీసిన తీరు మొదలు, ఉమ్మడి పాలమూరు వడ్డెరల, ST నినాదంతో సభ మారు మ్రోగి పోయింది. ముఖ్య అతిధి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(vice chairman TS planning board) గారి వివరణాత్మక, ST సాధన సంఘీభావం తో సభ ముగిసింది. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, వారికి స్టేజి పైన మాత్రం చాలా చిన్న పీట వేశారు. అలాగే, వడ్డెర మహిళా సమస్యలపై మాట్లాడడానికి, నాకు అవకాశం ఇస్తూనే, నా ప్రసంగాన్ని కుదించమని, ఒత్తిడి తేవడం నాకు కొంత భాధ కలిగించింది.

ఇందల్వాయి లో వడ్డెర మహిళ పై జరిగిన దాడిపై జైకిసాన్ TV లైవ్ లో మాట్లడిన జెరిపేటి చంద్రకళ

ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి లో ఒక మహిళ పై దాడి జరిగిన సంఘటన పై, పెద్దలకు నా నిరసన మరియు విన్నపాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నాను. సమస్య ఏదయినప్పటికీ, రాజవ్వ అనే వడ్డెర మహిళపై ఒక MPP స్థాయి వ్యక్తి, ఇమ్మడి గోపీ గారు, శారీరక దాడి చేయడం, అదికూడా, కాలితో తన్నడం, నేను ముందు ఒక సాటి మహిళగా ఖండిస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ ఈ మహిళకు ఆ ఎంపీపీ గారు, ఇంటిని అమ్మి, డబ్బు తీసుకుని ఆ ఇంటిని ఖాలీ చేయడానికి, ఇంకా డబ్బు కావాలని అడగడం చూస్తే ఇక్కడ మహిళకు ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తోంది. ఆ తరువాత, జరిగిన సంఘటనల్లో, మోసపోయిన మహిళ ను కాలితో తన్నడం అమానుషం. దీన్ని అందరూ ఖండించాలి.

వడ్డెర్ల దుర్భర వాస్తవానికి రాజుల డాంబికం తోడవడంతో కులం నష్టపోతోందని మహిళలు తిట్టిపోస్తున్నారు

ఈరోజు మా తాండ లోని వడ్డెర మహిళల ను ఒక చిన్న ఫంక్షన్ లో కలవడం జరిగింది. వీరంతా బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, ఒక సారి వీరిని కదిలిస్తే, ఈ కులంలో మహిళలుగా, ఇంటా బయట వీరు పడ్డ బాధలు చెప్తుంటే, వీరి శరీరాలకు తగిలిన గాయాలు మానిపోయినా, గుండెల్లో భాధ మాత్రం అలాగే ఉందనిపించింది. వీరంతా రాయి, మట్టి కుల వృత్తి లో నైపుణ్యమ్ కలవారే. వీరందరూ, మన దుర్బర బతుకులకు ఎలాంటి లాభం చేకూర్చని, రాజుల పోకడలు మన కులం లో చేర్చిన వారిని తిట్టి పోస్తున్నారు. ఒక్క వడ్డెర కులం లొనే మగ వారితో సమానం గా శారీరక హింస ను అనుభవిస్తున్నారని చెప్పారు. బయట పని చేసి, మళ్ళి ఇంట్లో పని చేసుకోవడం నరకం అని చెప్పారు.

వడ్డెర సొసైటీలు మరియు వాటి లాభ నష్టాలు

వడ్డెర సొసైటీల వల్ల అట్టడుగు వడ్డెరులకు అందవలసిన ప్రయోజనాలు అందడంలేదనే చెప్పాలి.