Vaddera women breaking stones along with men at work site

In this exclusive video, shot at a place adjacent to ORR in Ranga Reddy dt. in Telangana, you can see Vaddera women breaking stones along with men at work site. Plight of Vaddera women in particular is pathetic. Inescapable motherly responsibilities coupled with torturous stone work is a curse to Vaddera women. Such scenes should be considered to grant the deserved ST status to Vadders in Telugu states. As a lady, I am moved by these scenes! How do you feel? Dr. Chandrakala Jeripeti Vadderla ST Sadhana Samiti

Happy to Celebrate Diwali with Vaddera Labourers

Today we are all happy celebrating Diwali at home; but these Vadderas are having Diwali while breaking stones. If you notice, the area in which they are breaking these stones is the posh Banjara hills locality in Hyderabad. Every big mansion owned by MP/MLA/Movie Stars and Busineses men in here was built by breaking stones by Vaddera labourers. Had these big people reciprocated our sweat and blood help rendererd in building their dwellings by supporting our Vadderas ST demand, even these labaourers would be home and celebrating Diwali with their loved ones!

ఇంద్రా రెడ్డి నగర్ శ్రామిక వడ్డెర్లకు రగ్గుల పంపిణీ

ఇక్కడ ఎన్నికలే కాదు, చలి కాలం కూడా, ముందుగా వచ్చేసింది! మన శ్రామిక వడ్డెర్లు, పగటి ఎండ నుండి ఎలాగూ తప్పించు కోలేరు! స్వర్గీయ మా అమ్మగారి ఊరు కొల్లూరు సమీపం లో ఉన్న ఈ వడ్డెర్లకు నా భర్త, అక్టోబర్ 29 న, కొన్ని దుప్పట్లు ఇచ్చారు. గతించిన మా చిన్న మరిది, రాఘవేంద్ర ప్రసాద్ రాజు గారి, మూడవ వర్ధంతి సందర్భంగా, ఈ దుప్పట్లు పంచడం లో, వడ్డెర ST సాధన సమితి తరపున నేను కూడా పాల్గొని, మన శ్రామిక వడ్డెర్లకు కొంత సాయం అందించడం నా అదృష్టం గా భావిస్తున్నాను. (ఈ శ్రామిక వడ్డెర్లు ఇంకా చాలా విషయాలు ముచ్చటించారు. సమయం దొరికినప్పుడల్లా పోస్టు చేస్తాను) మీ సోదరి, డాక్టర్ జెరిపేటి చంద్రకళ వడ్డెర్ల ST సాధన సమితి

బసవ తారక నగర్ వడ్డెర ప్లాస్టిక్ బస్తీ

రంగారెడ్డి జిల్లా లో ఉన్నా, హైదరాబాద్ పరిధి లో ఉన్న బసవ తారక నగర్ వడ్డెర ప్లాస్టిక్ బస్తీ లాంటి వడ్డెర మురికి వాడలు భారతావని లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లెక్క లేనన్ని ఉన్నాయి. ఇక్కడి దారుణ సాంఘిక స్థితి గతుల్ని, ఒక చిన్న వీడియో చేసి, మనం ST కి ఎంత అర్హులమో వివరించడం జరిగింది. చూసి మీ అభిప్రాయాలను తెలుపడమే కాదు, మీ మిత్రులకు కూడా షేర్ చేయమని మనవి🙏 మీ సోదరి డాక్టర్ జెరిపేటి చంద్రకళ వడ్డెర్ల ST సాధన సమితి

రాహుల్ వడ్డెర్లకు ఇచ్చిన ST ప్రామిస్ను తెలంగాణ కాంగ్రెస్కు వివరిస్తున్న చంద్రకళ

హైద్రాబాద్ గాంధీ భవన్ లో, మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో TS కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ దామోదర రాజనరసింహ గారికి, "కేవలం ST" మానిఫెస్టో రిక్వెస్ట్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత, తెలంగాణాలో, ప్రముఖ పార్టీల మానిఫెస్టోల్లో గల్లంతవడం మరియు AP లోని ప్రముఖ పార్టీల మానిఫెస్టోల్లో వుండడం కూడా, కమిటీకి తెలపడం జరిగింది! దామోదర్ గారు, మన జనాభా మరియు మన దుర్భర సాంఘిక జీవనం పై, చాలా విషయాలు అడిగి తెలుసు కోవడం చాలా సంతోషం!

కార్మిక వడ్డెర మహిళల సాంఘిక కష్టాలు: ఒక భర్త మాటల్లో

(Note: ఈ వీడియో ను మహిళా దృక్పథంలో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను) విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఈ వడ్డెర బస్తీకి చెందిన ఈ భర్త వడ్డెర కులానికి చెందిన వారు కాదు. అంతే కాదు; తను హిందువు కూడా కాదు. ఈ యువకుడు ఒక వడ్డెర యువతిని పెళ్లి చేసుకుని, చక్కగా చూసుకుంటూ, కులాన్ని మరియు మతాన్ని కూడా గౌరవిస్తున్నాడు. ఈ విశయాన్ని బస్తీలో ధృవీకరించుకున్న తరువాతే, అతని మాటలు రికార్డు చేసాను. ఇతన్ని కలిసే వరకు నేను కూడా, వడ్డెర మహిళా కష్టాలన్నీ, కేవలం మహిళల మాటల్లోనే విన్నాను.

కర్ణాటక నుండి వచ్చిన వడ్డెర మహిళ తెలుగు రాష్ట్రాల్లో కుల దుస్థితి వివరించింది

కొంచెం చదువుకున్న ఈ కర్ణాటక మహిళ, చాలా సంవత్సరాలుగా కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంలో ఉంటోంది. ఇక్కడి వడ్డెర బస్తీలోని లేని మౌలిక సదుపాయాలపై, పాలకులకు చాలా ప్రశ్నలు సంధించింది. శారీరక హింసాత్మక వడ్డెర కుల వృత్తి వల్ల మహిళలు మరియు పిల్లలు భరిస్తున్న సాంఘిక సమస్యలను కూడా వివరించింది. వృత్తి సంబంధిత ప్రమాదాల్లోనే కాదు, వృత్తి ప్రదేశాల్లో సైతం వడ్డెర మహిళలకు రక్షణ లేదని చెప్పింది. కర్ణాటకలో భోవి(వడ్డెర్లు కర్ణాటకలో ఇలా పిలువబడుతున్నారు) కులం SC లో ఉండటం వల్ల సాంఘికంగా కొంత బాగుపడ్డారన్న నిజాన్ని వెల్లడించింది.

వడ్డెర సాంఘిక దుస్థితి మరియు కుటుంబ కష్టాలు

క్రింది ఫొటోలో ఉన్న వడ్డెర దుర్గారావు, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసి. ఇతడు, తన భార్య మరియు పిల్లలను వదలి, ఒక ఒరిస్సా అమ్మాయితో పారిపోయాడు. (ఆ తల్లి మరియు పిల్లలు, ఇప్పుడు భార్య పుట్టింట్లో, అమ్మమ్మ సంరక్షణలోనే ఉన్నారు. వారు పోస్ట్ చేయమంటేనే, ఆ వివరాలు ఇక్కడ పోస్టు చేస్తున్నాను) బయటికి, ఇది ఒక వ్యక్తి కి సంబంధించిన సమస్యలా కనిపించవచ్చు! నాకు మాత్రం ఇది ఒక సాంఘిక సమస్యగా గోచరిస్తుంది. ఇలాంటి శారీరక హింసతో కూడిన వృత్తి వల్ల వ్యసనాల మూలాన, వడ్డెర శ్రామికుల్లో, మూఢనమ్మకాలు, చేతబడులు, భార్యను అనుమానించే గుణాలు, వివాహేతర సంబంధాలు etc. ఎక్కువ కనిపిస్తాయి!

క్వారీలో కొడుకును పోగొట్టుకున్న వడ్డెర తండ్రి దీన గాధ

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వడ్డెర బస్తీలో స్థిరపడ్డ ఈ వృద్దుడు, ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ క్వారీల్లో, శ్రామికుడు. క్వారీలొనే ఇతని కొడుకు మరణించాడు. ప్రమాదం తరువాత కూడా, ఎలాంటి న్యాయం జరగలేదని, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. వృత్తి సంబంధిత ప్రమాద గాధలు ప్రతి వడ్డెర బస్తీలో ఉన్నాయి. కులంలోని బడా బాబులే, ఇలా చేస్తే, వడ్డెరలు వీరి కష్టాలు ఎక్కడ చెప్పుకుంటారు? అన్ని కులాలకు లభించే లేబర్ కార్డ్ సైతం, వడ్డెర్లకు మాత్రమే దాపురించే, ఇలాంటి క్వారీ కష్టాల్లో దేనికీ పనికిరాదని కూడా చెప్పవచ్చు!

వడ్డెర్ల వృత్తి తో వచ్చిన సాంఘిక కష్టాలు: ఒక వడ్డెర తల్లి మాటల్లో

కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సర్కిల్ కు కొద్ది దూరాన ఉన్న వడ్డెర బస్తీని, ఈ శ్రావణ శుక్రవారం(24 Aug 2018) రోజున సందర్శించాను. వీరి ఘోరమైన బ్రతుకులు, వారు ఏడ్చి వివరిస్తుంటే, ఏ సభ్య సమాజ సభ్యులైనా తల దించుకోవలసిందే. ముఖ్యంగా, ఈ నానమ్మ కధ వింటే, వడ్డెర్లకు ST ఎంత అవసరమో తెలుస్తుంది. వృత్తి సంభధిత దుర్వ్యసనాల వల్ల, ఈమె కుమారుడికి HIV సోకింది. తద్వారా, కోడలు కూడా, వ్యాధి గ్రస్తురాలయింది. కొడుకు మరియు కోడలు, ఆ జబ్బు వల్లే చనిపోయారు. 16 ఏళ్ల క్రితం వారు చనిపోతూ, ఒక బాబుకు కూడా HIV తో జన్మనిచ్చారు. ఆ బాబుని, ఈ నానమ్మ,16 ఏళ్ళు మందులిస్తూ, పెంచింది. ఆ మనవడు, రోజు రోజుకు క్షీణిస్తున్నాడు.