Skip to main content
Please wait...
Submitted by vsss on 27, Aug 2018
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వడ్డెర బస్తీలో స్థిరపడ్డ ఈ వృద్దుడు, ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ క్వారీల్లో, శ్రామికుడు. క్వారీలొనే ఇతని కొడుకు మరణించాడు. ప్రమాదం తరువాత కూడా, ఎలాంటి న్యాయం జరగలేదని, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. వృత్తి సంబంధిత ప్రమాద గాధలు ప్రతి వడ్డెర బస్తీలో ఉన్నాయి. కులంలోని బడా బాబులే, ఇలా చేస్తే, వడ్డెరలు వీరి కష్టాలు ఎక్కడ చెప్పుకుంటారు? అన్ని కులాలకు లభించే లేబర్ కార్డ్ సైతం, వడ్డెర్లకు మాత్రమే దాపురించే, ఇలాంటి క్వారీ కష్టాల్లో దేనికీ పనికిరాదని కూడా చెప్పవచ్చు! ప్రమాద వివరాలు, పోస్ట్ మార్టం నివేదిక, వృత్తి ప్రదేశంలోని భద్రతా చర్యల నివేదిక, కంప్లయింట్, FIR మరియు ప్రమాద కారకులపై చర్యల ప్రక్రియ ముగిసిన తరువాతే, లేబర్ కార్డు బెనిఫిట్స్ అందుతాయి. ఈ కేసు చూడండి! ప్రమాదం జరిగినట్టు కూడా బయటికి పొక్క నీయకపోతే, లేబర్ కార్డు ద్వారా సహజ మరణానికి వచ్చే 60000 రూపాయలు పొందడం కూడా కష్టమే! ఈ కుల వృత్తి సంబంధిత దోపిడీ తగ్గాలంటే, వడ్డెరలకు ST రిజర్వేషన్ ఇవ్వ వలసిందే! అప్పుడే, విద్య సంబంధిత ఉపాధి లభించి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రయాలను సైతం తెలపవలసింది గా మనవి. మీ సోదరి జెరిపేటి చంద్రకళ 789 368 2052 వడ్డెర్ల ST సాధన సమితి