వడ్డెర్ల ST సాధన లో మహిళదే ముఖ్య పాత్ర కావాలని జెరిపేటి చంద్రకళ పిలుపు

వడ్డెర మహిళల పిలుపు మేరకు కొన్ని రోజుల క్రితం, వికారాబాద్ జిల్లాలో పర్యటించాను. అక్కడి మహిళలు కూడా, ST సాధనే సర్వ వడ్డెర సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నారు. కులవృత్తి సంబంధిత వ్యసనాల వల్ల విచ్చిన్నమై వడ్డెర్ల కుటుంబ/సాంఘిక జీవన భారం మహిళలపైనే పడుతుందని వారందరూ చెప్తున్నారు. అలాగే, మన కులవృత్తిని, మిగతా BC ల కులవృత్తులతో, ఎందుకు పోల్చలేము అన్న విషయాన్ని వివరిస్తే, ఆసక్తి గా విన్నారు. అంతే కాదు, ST పోరాటంలో, మహిళలు ముఖ్య భూమిక పోషించాలని నేను ఇచ్చిన పీలుపుకు, వారంతా, సానుకూలంగా స్పందించడం, కులానికి శుభసూచకం

మీ సోదరి,

జెరిపేటి చంద్రకళ

వడ్డెర్ల ST సాధన సమితి

వడ్డెర్లకు కేవలం విద్య లేదా డబ్బు సాయం తో న్యాయం జరగదు - ST కావాలి

వడ్డెర్ల లో కొందరు విద్యాధికులు సైతం, అట్టడుగు వడ్డెర్ల సాంఘిక స్థితిగతుల వాస్తవాలు తెలియక పోవడం వల్ల, ఈ కులాన్ని BC లొనే ఉంచి, విద్య మరియు డబ్బు సాయం చేస్తే చాలు అనుకుంటున్నారు. ఈ ఆలోచన కొంత వరకు సబబే అయినా, వడ్ఢర్లకు పూర్తి స్థాయి న్యాయం జరగాలంటే ST రిజర్వేషన్ కావాలని, నా భర్త, ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు, క్లుప్తంగా వివరించడాన్ని నేను వీడియో తీసాను. పూర్తిగా చూసి, మీ అభిప్రాయాలను తెలపండి👍

తొర్రూరు వడ్డెర క్యాంప్ ప్లాస్టిక్ బతుకుల్లో రెండు నెలల్లో సంతోషకరమైన మార్పులు

నేను ఈ వడ్డెర క్యాంపును జూన్ మొదటి వారం లో సందర్శించాను. పాముల మధ్య వారి ప్లాస్టిక్ బతుకుల పై నేను చేసిన వీడియో మీలో చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను(చూడని వారి కోసం లింక్ కింద ఇస్తున్నాను) మళ్ళి ఆగస్టు 8 న, వారు పిలిస్తే, ఇక్కడికి వెళ్లడం జరిగింది. ఇప్పుడు వారికి పట్టాలు సాంక్షన్ కావడం తో, పునాదులు నిర్మించుకుని, పక్కా ఇళ్లు కట్టుకునే పనుల్లో ఉన్నారు. స్థానిక పాలకులు మరియు రెవిన్యూ సిబ్బందికే కాదు, ఈ వీడియో ని వైరల్ చేసి, ఈ మార్పుకు కారణమైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంపు కు పిలిచి, వీరి కష్టాలను ప్రపంచానికి చెప్పడం లో నాకు సహకరించిన మన, P ఎల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

కేశవ్ నగర్ వడ్డెర బస్తీ ఇళ్ల కూల్చివేత ఘటనపై జైకిసాన్ TV లో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్

ఈ రోజు, 12 ఆగస్టు, మధ్యాహ్నం జై కిసాన్ TV మధ్యాహ్నం న్యూస్ బులెటిన్ ప్రోగ్రాములో, కేశవ్ నగర్ వడ్డెర బస్తీ ఇళ్ల కూల్చివేత ఘటనపై, నేను 'ఫోన్ ఇన్' లో నేను లైవ్ లో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కూల్చివేతను, లీగల్ లేదా రెవిన్యూ సమస్య గా కాకుండా, సంచార వడ్డెర్ల, శారీరక హింసతో కూడిన కుల వృత్తి రీత్యా వచ్చిన సాంఘిక జీవన సమస్య గా చూడాలని చెప్పడం జరిగింది. తక్షణం, అరెస్టు చేయబడ్డ వడ్డెరలను విడుదల చేయాలని కూడా, ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది.

ఏ కులవృత్తి లో లేని శారీరక హింస వల్లే వడ్డెరల సాంఘిక జీవనం విచ్చిన్నమైంది

కుల వృత్తులపై ఆధార పడి బ్రతికే వెనకబడ్డ కులాల్లో, అత్యంత ప్రమాద కరమైన వృత్తి వడ్డేరులకే సొంతం. ఈ వృత్తిలో సంపాదించిన 10 రూపాయల్లో, 5 రూపాయలు తాగుడు వ్యసనానికి వాడకపోతే, వారికి మిశ్రా కూడా పట్టదు. ఈ కఠోర వృత్తి వల్ల వడ్డెరలకు మానసిక వికాసం కూడా కలగడం లేదు. ఈ వీడియో లో, నా భర్త, ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు, ఈ కులవృత్తి వల్ల మరియు తత్సంబంధిత వ్యసనాల వల్ల, వడ్డెర్లకు దాపురిస్తున్న సాంఘిక బాధలను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. దయచేసి పూర్తిగా చూసి, మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీ సోదరి, జెరిపేటి చంద్రకళ 789 368 2052

కేశవ్ నగర్ వడ్డెర బస్తీ ఇళ్ల కూల్చివేతలో అరెస్టుల పర్వం

కేశవ్ నగర్ బస్తీ కూల్చివేత సమయంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల్లో అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. చట్ట పరమైన చర్యలతో, అరెస్టులు జరిగిన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏడుపులు మరియ ఇంకా చాలా మందిని అరెస్టు చేస్తారు అనే భయాందోళనలు బస్తీలో కనిపిస్తున్నాయి. అట్టడుగు వడ్డెర్ల శారీరక హింస కులవృత్తి వల్ల దాపురించిన ఈ సాంఘిక వెనుకబాటుతనం వీరి కష్టాలకు మూలం. ఇలాంటి కులాన్ని ఇంకా BC ల్లో ఉంచి, వారి కులవృత్తులను మిగతా BC కులాల కులవృత్తులతో పోల్చి, పనిముట్లూ, లోన్లూ అంటే, తీరని అన్యాయం చేసినట్టే!

కేశవనగర్ వడ్డెర ఇళ్ల అమానుష కూల్చివేత పై బాధితుల స్పందన

2018 జులై 31 ఉదయం 60 పైచిలుకు వడ్డెర ఇళ్లను ప్రభుత్వం ఏ నోటీసు లేకుండా కూల్చేశారు. వారి కష్టాలను, వారి మాటల్లో వినాలని ఈ ప్రయత్నం చేసాను. వడ్డెరలకు చెప్పుకునే దిక్కు లేదనే ఇంత దుర్మార్గంగా ఇళ్లు కూల్చేశారని చెప్ప వచ్చు. వీరికి న్యాయం చేసి ప్రత్యామ్నాయ ఇళ్ళు మరియు వసతులు కల్పించే వరకు అందరం పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కేశవనగర్ వడ్డెర బస్తీ లో ఇళ్ల కూల్చివేత పై ప్రసంగిస్తున్న జెరిపేటి చంద్రకళ

31 జులై 2018 ఉదయం, రంగారెడ్డి జిల్లా, గౌలిదొడ్డి సమీపంలోని కేశవనగర్ వడ్డెర బస్తీ లో అమానుషంగా ఇళ్ల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ చర్యకు నిరసనాగ, లింగంపల్లి డిప్యూటి కలెక్టర్ కార్యాలయం దగ్గర BJP ఆధ్వర్యం లో ధర్నా జరిగింది. ఉదయం నాలుగు గంటలకు ఈ చర్య కు పాల్పడిన అధికారులు మరియు పాలనా యంత్రాగానికి వడ్డెరలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తోంది! అదే వేదికలో, మన వడ్డెరలకు ST రిజర్వేషన్ ఆవశ్యకత వివరించాను. ST లాంటి రిజర్వేషన్ ఉండి ఉంటే, మన మహిళలలను ఇలా కొట్టేవారా? ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ సేపు కేషవ్నగర్ లో నిలబడ లేకపోయాను. క్షమించాలి. మీ సోదరి జెరిపేటి చంద్రకళ 7893682052

కేశవ్ నగర్ ఇళ్ల కూల్చి వేత ఘటన లో గాయపడ్డ వడ్డెర మహిళ పందిగొట్టు పద్మ ఆవేదన

31 జులై 2018 న, ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ దుశ్చర్య లో ఈ మహిళ కూడా గాయ పడింది. ఈమె బంధువులకు కూడా గాయాలయ్యాయి. వీరి ఇళ్లు పూర్తిగా కూల్చివేశారు. వీరు వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు. అరెస్టు చేసిన వడ్డెర యువకులను ఇంకా విడుదల చేయలేదు. వడ్డెర్ల వలస బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో పద్మ మాటల్లో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆమె దుఃఖాన్ని చూసి, మన పాలకులు వడ్డెర్లకు అన్ని విధాలుగా రక్షణ కల్పించగల ST రిజర్వేషన్ కల్పించాలని ఒక వడ్డెర మహిళ గా విన్నపించు కుంటున్నాను. మీ సోదరి జెరిపేటి చంద్రకళ 7893682052

అనంత జిల్లా సెట్టూరు లో వడ్డెర దుర్భర జీవితం గురించి మహిళల మాటల్లో

జూన్ 26 న, చిత్రదుర్గ మార్గంలో, సెట్టూరు(కళ్యాణదుర్గం డివిజన్ అనంతపురం జిల్లా) లో, టీ కోసం ఆగినప్పుడు, కొంతమంది వడ్డెరలను చూసి వారితో కొంతసేపు మాట్లాడటం జరిగింది. ఇక్కడ మహిళలు కూడా వారికి ST/SC కావాలి అన్నారు. వడ్డెర్లలో రాజుల పోకడలను తిట్టిపోశారు. శారీరక హింస వృత్తులు, వ్యసనాలు మరియు వడ్డెరల సాంఘిక సమస్యలపై చాలా సేపు ముచ్చటించారు. పాలకులకు మరియు కుల నాయకులకు చాలా ప్రశ్నలు సంధించారు.