నల్లమాడ సమీపంలో ఉన్న, ఎక్కువ వడ్డెర గడపలు గల రామాపురం లో పెద్ద ట్యాంక్ ఉంది గాని, నీళ్లు లేవు. ఇక్కడ వడ్డెర బతుకుల్లో వలసలు పోగా, మిగిలిన వారికి కుల వృత్తి శాపాలు అడుగడునా దర్శనమిస్తున్నాయి. సోసిటీలు, లోన్ల పేర జరుగుతున్న కుల మోసాలను కూడా వీరు వివరించారు. వడ్డెర్ల వృత్తి వల్ల సంక్రమిస్తున్న వ్యసనాలు మరియు వాటి వల్ల సంభవించిన మరణాలు, ఇక్కడి వడ్డెర్ల సాంఘిక అధమ స్థితికి దర్పణాలు. మనకు, కులం లోని కొందరు మూర్ఖులు ఆంటగట్టిన రాజుల పోకడలను, అందరు మహిళలు, ఇక్కడ కూడా దుయ్యబట్టారు. మనతో అన్ని పనులు చేయించునే, ఈ సభ్య సమాజం, మనకు ఏదైనా పని చేయవలసి వస్తే, "వడ్డేరోడివి! నీకేం! బండను తవ్వి వెండిని తీస్తావు!", అని తప్పించుకునే నైజాన్ని, ఒక మహిళ చెప్పడం ఈ కులానికి, అన్ని విధాలా జరిగిన సాంఘిక అన్యాయాన్ని సూచిస్తుంది. మొత్తానికి, ఇక్కడి వడ్డెర్లు అందరూ, ఈ కులాన్ని, ST జాబితాలో కలిపి, కనీసం వారి పిల్లల మరియు మనవళ్ళ భవిష్యత్తునైనా బండల పాలు కాకుండా, కాపాడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ వీడియో చూసి స్పందిస్తారని ఆశిస్తున్నాను. జెరిపేటి చంద్రకళ 789 368 2052