వాయల్పాడుకు దగ్గర లో కల ఈ వడ్డె పల్లెలోని వడ్డెర మహిళలు, ఇంటా మరియు బయట పడుతున్న, సమస్యలు అనేకం! చిన్న వయస్సులోనే పెళ్ళి, పౌష్ఠికాహార లోపం, భర్తల వ్యసనాలు, వైవాహిక సమస్యలు, మాత్రమే కాదు, వీరికి కుల వృత్తి శాపాలు కూడా ఉన్నాయి. రాయి సంబంధిత వృత్తుల్లో పులిసిపోతున్న శరీరాన్ని విశ్రమింప చేయడానికి, కొన్ని ప్రాంతాల వడ్డెరలు మద్యం సేవిస్తున్న సమస్య అందరికీ తెలిసిందే! అయితే, తెలంగాణకు భిన్నంగా, ఈ ప్రాంత మహిళలు మద్యం సేవించడం లేదు కాబట్టి, వారు మద్యం కన్నా భయంకరమైన, సమస్యలో కూరుకు పోతున్నారు. కులంలో ని రాయి మరియు మట్టిలో శ్రమ చేస్తున్నప్పుడు, దప్పిక మరియు అలసట నివారణకై వారు ఆకు వక్క తో పాటు పొగాకు పొడి మరియు పొగాకు పట్టలను నమలడం వల్ల నోటి కాన్సర్ కు కూడా గురి అవుతున్నారు. ఇవన్నీ, పాలకులకు ప్రశ్నలే! వడ్డెర కులానికే ప్రత్యేకమైన ఈ వృత్తి సంబంధిత సాంఘిక మరియు ఆరోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కారించాలంటే, ఇప్పుడు మాకు, BC లో లభిస్తున్న చేయూత, ప్రోత్సాహకాలు సరిపోవు. వడ్డెర్లకుC/ST లాంటి రిజర్వేషన్, వస్తే తప్ప, ఈ కష్టాలు తీరవు అని, ఈ వీడియో చూస్తే ఎవరికైనా, ఇట్టే అర్ధమవుతుంది. ధన్యవాదాలు మీ సోదరి, జేరిపేటి చంద్రకళ 7893682052 www.vadderatimes.com