ఒక నిమిషంలో చదవొచ్చు
చదివేసారు

సంగారెడ్డి MLA శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు

శుక్ర, 22/03/2019 - 17:56
0 comments

వడ్డెర్ల ST సాధన సమితి అధ్యక్షురాలు, డాక్టర్ జెరిపేటి చంద్రకళ మరియు స్థానిక వడ్డెరలు, సంగారెడ్డి MLA, శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు. AP లో వడ్డెర్లను ST లో కలుపడానికి ప్రయత్నిస్తున్నట్టే,  తెలంగాణ లో కూడా అధ్యయనం మరియు అసెంబ్లీలో, వడ్డెర్లను ST లో చేర్చే విధంగా తీర్మానం చేసి ఢిల్లీ కి పంపే విధంగా కృషి చేయాలని విన్నపించుకున్నారు. MLA గారు కూడా, ఈ ప్రక్రియలో తన వంతు కృషి చేస్తామని చెప్పడం పట్ల నియోజకవర్గ వడ్డెరలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో, VSSS ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు, స్థానిక సీనియర్ వడ్డెర నాయకుడు సమ్మయ్య, పల్లపు రాజు, ఉమా ఉమేష్ తదితరులు పాల్గొన్నారు

Places related to ST Only Press Clips