- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి లో ఒక మహిళ పై దాడి జరిగిన సంఘటన పై, పెద్దలకు నా నిరసన మరియు విన్నపాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నాను. సమస్య ఏదయినప్పటికీ, రాజవ్వ అనే వడ్డెర మహిళపై ఒక MPP స్థాయి వ్యక్తి, ఇమ్మడి గోపీ గారు, శారీరక దాడి చేయడం, అదికూడా, కాలితో తన్నడం, నేను ముందు ఒక సాటి మహిళగా ఖండిస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ ఈ మహిళకు ఆ ఎంపీపీ గారు, ఇంటిని అమ్మి, డబ్బు తీసుకుని ఆ ఇంటిని ఖాలీ చేయడానికి, ఇంకా డబ్బు కావాలని అడగడం చూస్తే ఇక్కడ మహిళకు ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తోంది. ఆ తరువాత, జరిగిన సంఘటనల్లో, మోసపోయిన మహిళ ను కాలితో తన్నడం అమానుషం. దీన్ని అందరూ ఖండించాలి. ఇక్కడ, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఆ MPP ని immediate గా సస్పెండ్ చేయాలి. I request our honourable chief minister KCR garu to condemn this act and suspend this MPP immediately. I also request the concerned MP, Kalvakuntla Kavita garu to take action on this man do justice to Rajavva. ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా రాజ్యాంగ రక్షణ లేని, వడ్డెర మహిళ లపై ఎక్కివగా జరగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఎక్కువ శాతం రాయి మరియు మట్టి పనుల్లో మగ్గుతున్న సంచార జట్టులకు, వడ్డెరలకు అట్రాసిటీ చట్టం లేక పోవడం వల్ల జరుగుతున్నాయు. అంతేకాదు, వడ్డెరలు 40 సంవత్సరాలు గా అడుగుతున్న మరియు ఇంకా హామీ గానే ఉన్న, మా న్యాయమైన ST డిమాండ్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వడ్డేర్లను ST లో చేర్చడానికి చేయవలసిన ప్రక్రియను(process) ప్రారంభించాలని మనవి చేస్తున్నాను. జై హింద్