- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది
హైద్రాబాద్ గాంధీ భవన్ లో, మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో TS కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీ దామోదర రాజనరసింహ గారికి, "కేవలం ST" మానిఫెస్టో రిక్వెస్ట్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత, తెలంగాణాలో, ప్రముఖ పార్టీల మానిఫెస్టోల్లో గల్లంతవడం మరియు AP లోని ప్రముఖ పార్టీల మానిఫెస్టోల్లో వుండడం కూడా, కమిటీకి తెలపడం జరిగింది! దామోదర్ గారు, మన జనాభా మరియు మన దుర్భర సాంఘిక జీవనం పై, చాలా విషయాలు అడిగి తెలుసు కోవడం చాలా సంతోషం! సర్ఫేస్ డిమాండ్స్(క్వారీలు, కార్పొరేషన్లు, పదవులు etc.) గురించి మాట్లాడకుండా, మేము కోర్ డిమాండ్ ST గురించి మాట్లాడుతుంటే, అందరూ ఆసక్తి గా విన్నారు! రాహుల్ 2014 హిందూపూర్ సభ ప్రసంగం లో వడ్డెర్లకు ఇచ్చిన ST ప్రామిస్ గురించి గుర్తు చేయడం జరిగింది! రాహుల్ మన ST డిమాండ్ పై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, దామోదర్ గారు చెప్పడంతో ఈ మ్యానిఫెస్టో వినతి ముగిసింది! నా శక్తి మేరకు ఓ 15 మంది మహిళలను తీసుకెళ్ల గలిగాను! ఇంకా ఎక్కువ మంది కుల సోదర సోదరీమణులు వస్తే బాగుండేది! But, that's OK! సహకరించిన అశోక్, బీరంగూడా కృష్ణ బృందానికి మరియు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏 మీ సోదరి, జెరిపేటి చంద్రకళ, వడ్డెర్ల ST సాధన సమితి.