1. MBC లకు కూడా SC/ST లను పోలిన చట్ట సభల మరియు క్రీమీ లేయర్ లేని ఉద్యోగ రిజర్వేషన్స్ ఇవ్వగలరా?
2. ఒక వేళ, అలా ఇవ్వలేనప్పుడు, మనకు MBC లో ఉండడంవల్ల కలిగే లాభాలు ఇప్పడు AP లో కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ లతో పోల్చవచ్చా? ఎందుకంటే, ప్రత్యేక హోదా అడుగుతుంటే, ప్యాకేజీలతో సరిపెట్టుకోమనడం AP లో సమస్య. మనం కూడా ఈ MBC ప్యాకేజీ కంటే, ST లాంటి ప్రత్యేక హోదా కోసం అడిగితే తప్పేముంది?
3. ST పోరాటంలో, వాల్మీకి/బోయ సోదరులు అమరావతి లో తొలివిజయం సాధించేశారు. సో డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో ST కాకుండా మిగిలింది తెలుగు రాష్ట్రాల్లోని వడ్డెర్లు మాత్రమే అని తెలిసాకకూడా, MBC/DNT తాయిలాల తో సరిపెట్టుకోవడం కరక్టే అంటారా?
4. వాల్మీకి సోదరులకు, ట్రైబ్స్ కు కావాల్సిన ప్రత్యేక భాష, సంస్కృతి, నగరాలకు దూర సంచారం వంటి ప్రత్యేకతలు ఉండటం వల్లే, AP అసెంబ్లీ లో ST తీర్మానం చేశారా?
5. ST ల్లో మనల్ని ఎందుకు కలపరో అన్న సాంకేతిక అంశాల్ని మనమే ప్రాచుర్యం చేసుకోవడం ఎంత కరెక్టు? అన్యాయమైపోయిన ట్రైబ్స్ లో మన తెలుగు వడ్డెర్లు మాత్రమే ST కాకుండా మిగిలిపోయారు అని తెలిసికూడా, మనం నిరాశగా MBC/DNT లవైపు మొగ్గు చూపడం సబబే అంటారా?
6. వడ్డేర్లలో అట్టడుగు వర్గాల వరకు ఉపయోగపడే ST డిమాండ్ ను అందరూ ఏక కంఠం తో ఎందుకు అడగలేకపోతున్నారు? కాంట్రాక్టర్లకు, క్వారీ యజమానులకు ఎక్కువగా ఉపయోగపడే, ఈ తాత్కాలిక MBC/DNT తాయిలాలకె మనమంతా ఎందుకు మొగ్గు చూపుతున్నాము?
ఇవి నా సందేహాలు మాత్రమే! కులం లోని పెద్దలు నివృత్తి చేస్తే వినాలని ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే, మనలో కొంతమంది రాజులం, రాజులం అనే రొద ఇంకొక ఎత్తు. ఇప్పటికీ, కొంత మంది తమ్ముళ్లు, మనం రాజులం అంటూ, నా FB మెసెంజర్ లో నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ తమ్ముళ్ళు కులం లోని వాస్తవాల్ని అర్ధం చేసుకుని, కనీసం కొంతకాలమైనా ఈ అక్కరుకురాని, అరిగిపోయిన రాచరికాన్ని పక్కన పెడితే బావుణ్ణు!
మీ మిత్రుడు,
Dr. ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది