ఇంత తతంగం ఉంటే, లోన్ల వల్ల బాగుపడ్డ BC లకు పెద్దగా కష్టం కాకపోవచ్చు!
బట్, అన్యాయంగా BC లోకి నెట్టబడి, పూర్తిగా వెనకబడ్డ, నిరక్షరాస్య వడ్డెర శ్రామికులకు వీటి వల్ల లాభాల కంటే ఎక్కువ సాంఘిక( ఆర్ధిక కాదు అని గమనించాలి ) నష్టాలు ఉన్నాయని ఫీల్డ్ స్టాటిస్టిక్స్ చెపుతున్నాయి.
వీటి వల్ల ఎక్కువ ఉపయోగం మాత్రం దళారీలు మరియు కులాన్ని అమ్ముకుని బ్రతికే సంఘాన్నజీవులకే అని నా అభిప్రాయం.
ST లాంటి రిజర్వేషన్ సాధించుకుంటే, మళ్ళి మనల్ని శారీరక హింసతో కూడిన కుల వృత్తి లోకి తోసే, ఈ అర కొర లోన్ల కోసం ప్రాకులాడకుండా, విద్య సంబంధిత ఉపాధి వైపు పరుగులు తీయ వచ్చు!
నేను నా వాస్తవ పరిజ్ఞానం మేరకు, ఈ అంశాన్ని, కుల సాంఘిక జీవన నేపథ్యం లో చూసి విశ్లేషించాను.
అంతే కానీ, అన్ని కులాలకు ఇచ్ఛే, ఈ ప్రభుత్వ చేయూత లోన్లను నేను వ్యతిరేకించడం లేదు.
అర్ధం చేసుకోగలరు
🙏🙏🙏🙏🙏
Dr. Orsu Srinivasa Kumar Raju
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది