Skip to main content
దయచేసి వేచివుండండి...
Submitted by vsss on 27, Jul 2018
జంటనగరాలకు కూటవేతు దూరం లో ఉన్న ఈ మురికి వాడలో, వడ్డెర్లకు, వారి శారీరక హింస తో కూడిన కులవృత్తి వల్ల వచ్చే సాంఘిక సమస్యలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ, కట్టెల పొయ్యిలో వంట చేసుకునే వారు మరియు కనీసం రేషన్ కార్డులు కూడా లేని వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. బండ పని వల్ల దాపురించిన తాగుడు, మహిళలకు శాపంగా మారింది. లోన్లు, లేబర్ కార్డుల తోనే కులం బాగు పడుతుందనుకునే నాయకులకు, మహిళలు చాలా ప్రశ్నలు సంధించారు. వడ్డెర్లకు ST లాంటి రిజర్వేషన్ తో విద్య సంబంధిత ఉద్యోగాలు వచ్చి తమ భవిష్యత్తు మారుతుందని ఇక్కడి మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. 'మనం రాజుల' అని ఎవరైనా అన్నప్పుడు, వీరు చాలా బాధపడుతున్నారు. ఈ అట్టడుగు బతుకులకు, రాజుల నిర్వచనాలు చేర్చి, తీరని అన్యాయం చేశారని, ఇక్కడి మహిళలు అంటున్నారు.