డ్డెర్ల ST సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు మరియు స్థానిక వడ్డెరలు, ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు, కడప MLA శ్రీ అంజాద్ బాషా గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు. AP లో వడ్డెర్లను ST లో కలుపడానికి, స్టడీ కోసం ఇప్పటికే మొదలు పెట్టిన సత్యపాల్ కమిటీ పర్యటనలు వేగవంతం చేసి, వడ్డెర్లను ST లో చేర్చే విధంగా తీర్మానం చేసి ఢిల్లీ కి పంపే కృషి చేయాలని విన్నపించుకున్నారు. MLA గారు కూడా, ఈ ప్రక్రియలో తన వంతు కృషి చేస్తామని చెప్పడం పట్ల నియోజకవర్గ వడ్డెరలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో, స్థానిక సీనియర్ వడ్డెర నాయకుడు. బత్తల శ్రీనివాస్ గారు మరియు పలువురు లోకల్ వడ్డెర్లు పాల్గొన్నారు.
AP లో MLA లకు 'ST ఓన్లీ' వినతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ లో ఇప్పటికే వినతులు ఇస్తున్నారు. 50 ఏళ్లుగా, ఉమ్మడి రాష్ట్రంలో, మనకు చేజారిన హక్కును, ప్రాంతీయ దృష్టితో చూడటం దౌర్భాగ్యం😢
పాలకులకు ST వినతులు మరియు ఆ వినతుల వివరాలు, లోకల్ ప్రింట్ మీడియాలో ప్రచురణ మన వ్యూహాత్మక పతాక స్థాయి ఢిల్లీ పోరుకు కీలకం కానున్నాయి👍
అన్ని జిల్లాల వినతులు 10 రోజుల్లో పూర్తి చేసి VSSS వెబ్సైట్ లో పెట్టేస్తాను. రెండు రాష్ట్రాల MP వినతులు కూడా అదే సమయానికి సిద్ధం చేస్తాను
స్థానిక కుల సోదరులు, ఈ వినతులు ఇస్తే, ST హక్కు పోరుకు ఊతం లభిస్తుంది
Please help ourselves to achieve our lost ST right
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info
- Log in to post comments