నాగర్ కర్నూల్ గారికి ఇస్తున్న ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్
ప్రొఫెసర్ ఓర్సు రంగయ్య గారు చొరవ తీసుకుని, సమయం చేసుకుని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని, పలువురు MLA లకు మన 'ST ఓన్లీ' వినతులు ఇవ్వడాన్ని కులం హర్షిస్తోంది.
ఒకే రోజులో, ఆచ్ఛంపేట మరియు నాగర్ కర్నూలు MLAలకు, 'ST ఓన్లీ' వినతులు సమర్పించి, ఆ సమర్పణ వివరాలను పలు లోకల్ పేపర్లలో స్పష్టంగా వచ్చే విధంగా చేసిన రంగయ్య గారు మరియు వారి కృషి సేవా సంఘం సభ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు🙏
VSSS వెబ్సైట్ లోని, తెల్ల కాగితం వినతులను, మీ సంఘం/సమితి లెటర్ హెడ్స్ పై ప్రింటు చేసుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని MLA/MP లకు ఇచ్చే విధంగా నేను సర్వం సిద్ధం చేసాను.
మీ నియోజకవర్గ వడ్డెర్ల MLA/MP లకు 'ST ఓన్లీ' వినతుల సమర్పణలో ఏ సాయం కావాలన్నా, నిర్మొహమాటంగా నాకు 7893682052 పై కాల్ చేయండి👍
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
- Read more about నాగర్ కర్నూల్ గారికి ఇస్తున్న ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది