కుత్బుల్లాపూర్ MLA గారికి మన ST హక్కు వినతి ప్రెస్ క్లిప్పింగ్
మూడవ ప్రయత్నంలో, నేను కుత్బుల్లాపూర్ MLA గారికి మన ST హక్కు వినతి ఇవ్వడంలో సఫలీకృతురాలునయ్యాను👍.
నాతో కలిసి, ఈ మూడు ప్రయత్నాల్లో MLA గారి వద్దకు వచ్చిన, రెక్కాడితే గాని డొక్కాడని మన శ్రామిక వడ్డెర్లు, నిన్న MLA గారిని కలిసి దిగిన ఫోటోల్లో లేక పోవడం దురదృష్టం. వారు MLA గారి ఆఫీసు వద్ద ఆలశ్యం అవుతుండటంతో, పనికి వెళ్లి పోయారు. ఇది మన దుర్భర స్థితి!
అయినా సరే! రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ST హక్కు వినతులు ఇలాగే కొనసాగాలి. ప్రతి వినతి కనీసం ఒక లోకల్ పేపర్లో వచ్చేట్టు కూడా ప్రయత్నించాలి. అప్పుడే, 80 లక్షల వడ్డెర్లకు చేజారిన ST హక్కు గురించి అందరికీ తెలిసి, సమాజ మద్దతు కూడా లభిస్తుంది.
దయచేసి అందరూ సహకరించి, ఫైనల్ ఢిల్లీ పోరు ముందు, పెట్టించవలసిన లక్ష డిజిటల్ సంతకాలు మరియు MLA/MP వినతులను విజయవంతం చేసి, ST సాధించడంలో మీ సోదరి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను.
Note: మన ST హక్కు సాధన వ్యూహాత్మక పోరు వివరాలు క్రింద ఇచ్చిన VSSS వెబ్సైటు లో చూడగలరు. ST సాధన పై అనుమానాలు లేదా వినతులు ఇవ్వడానికి సాయం కోసం నాకు కాల్ చేయగలరు
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
789 368 2052
www(dot)vsss(dot)info
- Read more about కుత్బుల్లాపూర్ MLA గారికి మన ST హక్కు వినతి ప్రెస్ క్లిప్పింగ్
- వ్యాఖ్యలు(కామెంట్స్) చేయడానికి లాగిన్ కావలసుంటుంది