పాలమూరు సోదరుల పిలుపు మేరకు, 19 జూన్ నాడు, నేను, వనపర్తి వడ్డెర మహా సభకు వెళ్లడం జరిగింది. వేముల వెంకటేష్ గారు, వడ్డెరలకిచ్చిన ST భరోసా పై నిలదీసిన తీరు మొదలు, ఉమ్మడి పాలమూరు వడ్డెరల, ST నినాదంతో సభ మారు మ్రోగి పోయింది. ముఖ్య అతిధి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(vice chairman TS planning board) గారి వివరణాత్మక, ST సాధన సంఘీభావం తో సభ ముగిసింది. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, వారికి స్టేజి పైన మాత్రం చాలా చిన్న పీట వేశారు. అలాగే, వడ్డెర మహిళా సమస్యలపై మాట్లాడడానికి, నాకు అవకాశం ఇస్తూనే, నా ప్రసంగాన్ని కుదించమని, ఒత్తిడి తేవడం నాకు కొంత భాధ కలిగించింది. అయినప్పటికీ, ఈ చిన్న అవకాశాన్ని కూడా, వడ్డెర మహిళల ల్లో చైతన్య స్ఫూర్తికి అవకాశం మరియు నాందిగా భావించి, సద్వినియోగం చేసుకున్నాను. సభానంతరం, వడ్డెర అంతర్గత సమస్యలపై చాలా సేపు చర్చించి, రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాను. జై వడ్డెర