Skip to main content
Please wait...
Submitted by vsss on 25, Aug 2018
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం సర్కిల్ కు కొద్ది దూరాన ఉన్న వడ్డెర బస్తీని, ఈ శ్రావణ శుక్రవారం(24 Aug 2018) రోజున సందర్శించాను. వీరి ఘోరమైన బ్రతుకులు, వారు ఏడ్చి వివరిస్తుంటే, ఏ సభ్య సమాజ సభ్యులైనా తల దించుకోవలసిందే. ముఖ్యంగా, ఈ నానమ్మ కధ వింటే, వడ్డెర్లకు ST ఎంత అవసరమో తెలుస్తుంది. వృత్తి సంభధిత దుర్వ్యసనాల వల్ల, ఈమె కుమారుడికి HIV సోకింది. తద్వారా, కోడలు కూడా, వ్యాధి గ్రస్తురాలయింది. కొడుకు మరియు కోడలు, ఆ జబ్బు వల్లే చనిపోయారు. 16 ఏళ్ల క్రితం వారు చనిపోతూ, ఒక బాబుకు కూడా HIV తో జన్మనిచ్చారు. ఆ బాబుని, ఈ నానమ్మ,16 ఏళ్ళు మందులిస్తూ, పెంచింది. ఆ మనవడు, రోజు రోజుకు క్షీణిస్తున్నాడు. ఆ బాబు ఉన్నంత కాలం సంతోష పెట్టడానికి కూడా, చిన్న చిన్న కోర్కెలు తీర్చడానికి సైతం ఆమె కష్టం/వృధ్యాప్య పింఛను చాలడం లేదు! అది చూసి, నా దుర్గ గుడి హుండీ మొక్కును ఈ నానమ్మ దగ్గరే తీర్చేసుకుని, భాధతో హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. నా శ్రావణ శుక్రవారం, ఈ విధంగా ముగిసింది. ఇలాంటి మా రాయి/మట్టి వృత్తి తో వచ్చిన కష్టాలు, మమ్మల్ని BC ల్లో బంధించి, కేవలం నాలుగు కోట్లు, లోన్లు, లేబర్ కార్డులు లేదా ఓ రెండు పదవులు ఇస్తే తీరిపోతాయా? మా వడ్డెర్లకు ST ప్రామిస్లు ఇంకా ఎంత కాలం చేస్తారు? పాలకులరా, మీరు కూడా, ఈ తల్లికి ఎలా న్యాయం చేస్తారో చెప్పండి! మీ సోదరి, జెరిపేటి చంద్రకళ 789 368 2052 వడ్డెర్ల ST సాధన సమితి www.vadderatimes.com