- Log in to post comments
ఈరోజు మా తాండ లోని వడ్డెర మహిళల ను ఒక చిన్న ఫంక్షన్ లో కలవడం జరిగింది. వీరంతా బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, ఒక సారి వీరిని కదిలిస్తే, ఈ కులంలో మహిళలుగా, ఇంటా బయట వీరు పడ్డ బాధలు చెప్తుంటే, వీరి శరీరాలకు తగిలిన గాయాలు మానిపోయినా, గుండెల్లో భాధ మాత్రం అలాగే ఉందనిపించింది. వీరంతా రాయి, మట్టి కుల వృత్తి లో నైపుణ్యమ్ కలవారే. వీరందరూ, మన దుర్బర బతుకులకు ఎలాంటి లాభం చేకూర్చని, రాజుల పోకడలు మన కులం లో చేర్చిన వారిని తిట్టి పోస్తున్నారు. ఒక్క వడ్డెర కులం లొనే మగ వారితో సమానం గా శారీరక హింస ను అనుభవిస్తున్నారని చెప్పారు. బయట పని చేసి, మళ్ళి ఇంట్లో పని చేసుకోవడం నరకం అని చెప్పారు. అయినా సరే, భర్తల అలవాట్లు, బహు భార్యల పరంపర, ఆడ బిడ్డల చదువుల విషయాల్లో మహిళ లపై కొనసాగుతున్న వివక్ష పై మాట్లాడారు. మగపిల్లలు 10 సంవత్సరాల వయసులోనే తాగడం, వీరిని బాగా భాధిస్తున్న విషయం. వాట్సాప్ లో వీరు లేరు. చదువులకు దూరమైన వీరు, చివరికి ఫోన్ రీఛార్జ్ కూడా చదువుకున్న పిల్లలపై ఆధార పడుతున్నాం అని చెప్తుంటే, మహిళ గా నాకు చాలా భాధ కలిగింది.