Skip to main content
Please wait...
Submitted by vsss on 14, Aug 2018

నేను ఈ వడ్డెర క్యాంపును జూన్ మొదటి వారం లో సందర్శించాను. పాముల మధ్య వారి ప్లాస్టిక్ బతుకుల పై నేను చేసిన వీడియో మీలో చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను(చూడని వారి కోసం లింక్ కింద ఇస్తున్నాను) మళ్ళి ఆగస్టు 8 న, వారు పిలిస్తే, ఇక్కడికి వెళ్లడం జరిగింది. ఇప్పుడు వారికి పట్టాలు సాంక్షన్ కావడం తో, పునాదులు నిర్మించుకుని, పక్కా ఇళ్లు కట్టుకునే పనుల్లో ఉన్నారు. స్థానిక పాలకులు మరియు రెవిన్యూ సిబ్బందికే కాదు, ఈ వీడియో ని వైరల్ చేసి, ఈ మార్పుకు కారణమైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంపు కు పిలిచి, వీరి కష్టాలను ప్రపంచానికి చెప్పడం లో నాకు సహకరించిన మన, P ఎల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కొందరికి పట్టాలు రావాల్సి ఉంది. ఆ విషయం పై కూడా ఒత్తిడి తీసుకు వస్తున్నారు. సంచార శ్రామిక ప్లాస్టిక్ బతుకుల జీవన ప్రమాణాలు త్వరిత గతిన మారాలంటే, వడ్డెర్లను ST జాబితా లో చేరిస్తే తప్ప సాధ్యం కాదని, శ్రామిక వడ్డెర్లు అంటున్న మాటలను గుర్తు చేస్తూ, ఈ వీడియోను ముగించాను! ఈ వీడియోలో మార్పును, చూసి మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీ సోదరి జెరిపేటి చంద్రకళ www.vadderatimes.com