- Log in to post comments
కొంచెం చదువుకున్న ఈ కర్ణాటక మహిళ, చాలా సంవత్సరాలుగా కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంలో ఉంటోంది. ఇక్కడి వడ్డెర బస్తీలోని లేని మౌలిక సదుపాయాలపై, పాలకులకు చాలా ప్రశ్నలు సంధించింది. శారీరక హింసాత్మక వడ్డెర కుల వృత్తి వల్ల మహిళలు మరియు పిల్లలు భరిస్తున్న సాంఘిక సమస్యలను కూడా వివరించింది. వృత్తి సంబంధిత ప్రమాదాల్లోనే కాదు, వృత్తి ప్రదేశాల్లో సైతం వడ్డెర మహిళలకు రక్షణ లేదని చెప్పింది. కర్ణాటకలో భోవి(వడ్డెర్లు కర్ణాటకలో ఇలా పిలువబడుతున్నారు) కులం SC లో ఉండటం వల్ల సాంఘికంగా కొంత బాగుపడ్డారన్న నిజాన్ని వెల్లడించింది. ముఖ్యంగా, మహిళలకు రక్షణ కల్పించి, అన్ని విధాలుగా, ICU లో ఉన్న తెలుగు వడ్డెర్ల కు, వెంటిలేటర్ సపోర్ట్ లాంటి ST రిజర్వేషన్ ఇవ్వాలని ఈ మహిళ సైతం కోరుతోంది. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు.
మీ సోదరి, Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి