- Log in to post comments
ఈ రోజు, 12 ఆగస్టు, మధ్యాహ్నం జై కిసాన్ TV మధ్యాహ్నం న్యూస్ బులెటిన్ ప్రోగ్రాములో, కేశవ్ నగర్ వడ్డెర బస్తీ ఇళ్ల కూల్చివేత ఘటనపై, నేను 'ఫోన్ ఇన్' లో నేను లైవ్ లో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కూల్చివేతను, లీగల్ లేదా రెవిన్యూ సమస్య గా కాకుండా, సంచార వడ్డెర్ల, శారీరక హింసతో కూడిన కుల వృత్తి రీత్యా వచ్చిన సాంఘిక జీవన సమస్య గా చూడాలని చెప్పడం జరిగింది. తక్షణం, అరెస్టు చేయబడ్డ వడ్డెరలను విడుదల చేయాలని కూడా, ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది. ' వడ్డెర్ల ST సాధన సమితి ' తరఫున, ఇలాంటి కేశవ నగర్ లాంటి అవాంఛనీయాలు, మరో వడ్డెర బస్తీ లో జరగ కుండా చూడాలంటే, వడ్డెర్ల 50 సంవత్సరాల ST సాధన పోరాటంపై, ప్రభుత్వాలు సానుకూలం గా స్పందించి, వడ్డెర్లను ST లిస్టులో కలిపే దిశగా, సత్వర రాజ్యాంగ చర్యలు చేపట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేశవ్ నగర్ బస్తీ వడ్డెర ఇళ్ల కూల్చివేత, అరెస్టులు మరియు కష్టాలను వెలుగులోకి తెచ్చి, తద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తున్న జై కిసాన్ TV కి ప్రత్యేక ధన్యవాదాలు🙏 మీ సోదరి జెరిపేటి చంద్రకళ 789 368 2052 949 104 2052 వడ్డెర్ల ST సాధన సమితి www.vadderatimes.com