- Log in to post comments
(Note: ఈ వీడియో ను మహిళా దృక్పథంలో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను) విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఈ వడ్డెర బస్తీకి చెందిన ఈ భర్త వడ్డెర కులానికి చెందిన వారు కాదు. అంతే కాదు; తను హిందువు కూడా కాదు. ఈ యువకుడు ఒక వడ్డెర యువతిని పెళ్లి చేసుకుని, చక్కగా చూసుకుంటూ, కులాన్ని మరియు మతాన్ని కూడా గౌరవిస్తున్నాడు. ఈ విశయాన్ని బస్తీలో ధృవీకరించుకున్న తరువాతే, అతని మాటలు రికార్డు చేసాను. ఇతన్ని కలిసే వరకు నేను కూడా, వడ్డెర మహిళా కష్టాలన్నీ, కేవలం మహిళల మాటల్లోనే విన్నాను. వడ్డెర కులంలో మహిళలకు, కష్టాలు, పురుషులకంటే, పది రెట్లు ఎక్కువ ఉన్నాయని, ఎప్పుడూ నేను చెప్పే మాటలే, ఈ యువకుడు కూడా చెప్పడం, నాకు ఒకింత ఆశ్చర్యం కూడా కలిగించింది. ఇతడు చెప్పే మాటల్లో, ఏ మాత్రం అతియోశక్తి లేదు. మహిళలకు కులాలకతీతంగా కష్టాలు ఉన్నప్పటికీ, వడ్డెర మహిళల సాంఘిక కష్టాలు మాత్రం వర్ణనాతీతం! నేను చేసిన విడియోలోన్నంటిలో, ఇతని మాటల వీడియో నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ వీడియో చూసినప్పుడల్లా, మా అమ్మ గారు, స్వర్గీయ లక్ష్మీ దేవి గారు పడ్డ కష్టాలన్నీ, నాకు గుర్తొస్తుంటాయి! నా తల్లి కూడా, వడ్డెర మహిళగా, 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి పీటలు ఎక్కించబడి, 18 సంవత్సరాలకే, ముగ్గురు పిల్లల తల్లైన వెంటనే, వడ్డెర మగమాహారాజైన నా తండ్రి, అసంసార దుర్వ్యసనాలను ఎదిరించి, ప్రాణాలు సైతం కోల్పోయింది. ఈ వెనకబడ్డ కుల దృష్టిలో, మా అమ్మ చావులో, మా అమ్మ తప్పు మాత్రమే, ఉందని చెప్పడం, సభ్య సమాజానికే సిగ్గు చేటు! మూడేళ్ళ వయసు నుండి, తల్లి లేకుండా, ఎంత సాంఘిక నరకం అనుభవించానో, కాసేపు పక్కన పెడితే, మా అమ్మ కు జరిగిన అన్యాయాన్ని కనీసం ప్రశ్నించే స్థాయి లేదా సంస్కృతి ఇక్కడ లేదంటే, కుల పంచాయితీల్లో సైతం, మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు! దయచేసి ఈ వీడియోను, తప్పుగా తీసుకోకండి! వడ్డెర కులం లో కూడా, మహిళలను గౌరవించి, కష్టాలు లేకుండా చూసుకునే, ఇలాంటి పురుషులు కూడా ఎందరో ఉన్నారు! అలాంటి వారికి మా వడ్డెర మహిళల తరపున, ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వీడియోను మహిళా దృక్పధం లో చూసి, మహిళలను కష్టపెట్టకుండా చూసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ సోదరి Dr. జెరిపేటి చంద్రకళ
వడ్డెర్ల ST సాధన సమితి