కొన్ని ప్రశ్నలు జవాబులు
(సోదరుడు సోమరాజు, 2017 లో సంధించిన ప్రశ్నలకు, నాకు తోచిన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇందులోని తప్ప ఒప్పులను చర్చించగలరు. Dr. ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు 9550136660)
1. మనమెందుకు ఈ BC గ్రూప్ లొ ఉన్నాము?
A. చావు తప్పి కన్ను లొట్ట పోవడం వల్ల ... అంటే, మన అదృష్టం బావుండి మనల్ని OC లో పడెయ్యలేదు. (లేకపోతే, మన రాచరిక పిచ్చికి ఖచ్చితంగా OC లో తోసేసే వారు)
2. ST రిజర్వేషన్ సాధన దిశగా మన పాత్ర ఏమిటి?
A. ప్రస్తుతం మనం గందరగోళం లో ఉన్నాము. కొంతమంది ST, మరికొందరు DNT, ఇంకొందరు MBC, బాగుపడ్డోళ్లు ఏకం గా OC ల్లోని క్షత్రియులతో సమానత్వం కోసం పోరాడాలనుకుంటున్నారు. సో, ST పోరాటం పాత్ర ఇంకా బలపడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు
3. BC A వలన మనకు గల నష్టాలు ఏమిటి?
A. BC A లో కళింగ(శ్రీకాకుళం AP) లాంటి బాగా అభివృద్ధి చెందిన కులాలున్నాయి. BC లో ఉంటే, ఉద్యోగ రిజర్వేషన్స్ లో క్రీమీ లేయర్ వర్తిస్తుంది. BC లకు రాజకీయ రిజర్వేషన్స్ లో పురోగతి లేదు. పార్టీలు, BC లకు టికెట్ ఇద్దామనుకున్నా, గౌడ్స్, యాదవులు, మున్నూరు కాపులు, ముదిరాజ్ సోదరులను దాటి టికెట్ మనవాళ్ళకు రావడం చాలా అరుదు.
4. ST లో చేరితే మనకు గల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమైనా ఉన్నాయా?
A. ST అయితే రాజకీయ, విద్య మరియు ఉద్యోగ అవకాశాలు పక్కా. నో క్రీమీ లేయర్ ప్రాబ్లమ్. మన శ్రామిక కులానికి అట్రాసిటీ చట్టం రక్షణ, BC ఇవ్వగలదా? నష్టాల విషయానికొస్తే, ST వస్తే, రాజులమనుకునే వడ్డెర్లు, కొంత నిరాశకు లోనవుతారేమో!
5. నా కులం కోసం ఏవిదంగా, నావంతు పాత్ర పోషించాలి?
A. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఏవిధంగా సాయం చేసినా OK. సాయం చేయకపోయినా ఫరవాలేదు కానీ, ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, రాజులం అంటూ, అసందర్భ ఆర్భాటాలకు దూరంగా ఉండటం మంచిది
6. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మనం st జాబితాలో చేర్చే అవకాశం ఉంది?
A. ఆర్టికల్ 366 (24) మరియు 341
7. మిగతా రాష్ట్రాలలో మన జీవన విధానం ఏమిటి?
A. అన్ని రాష్ట్రాల్లో, స్వతంత్రానంతరం, చాలా తక్కువ మంది వడ్డెర్లకు, విద్య మరియు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ, ఎక్కువ శాతం వడ్డెర్లు లేబర్ గానే బ్రతుకుతున్నారు.
8. వారిని ఎందుకు ST మరియు SC జాబితాలో చేర్చారు?
A. SC మరియు ST లో చేర్చుట మరియు తీసివేయు ప్రక్రియ, పార్లమెంటు పరిధిలో ఉన్నా, రాష్ట్రాల సిఫార్సులతో కూడా వత్తిడి తేవచ్చు. సంబంధిత రాష్ట్రాల్లో, ఎక్కడైతే మనవాళ్ళు, ఉనికిని చాటుకున్నారో, అక్కడ వారికి రాజ్యాంగబద్దంగా SC/ST గుర్తింపు లభించింది. కర్ణాటక లో మైసూర్ రాజులు, మనకు షెడ్యూల్డ్ స్టేటస్ రావడానికి దోహద పడ్డారని తెలుస్తోంది.
9. ST కి మనమెందుకు అర్హులం కాదు?
A. మనం అన్ని రకాలుగా అర్హులమే. మన కులం లో వెనకబడ్డ వారి శాతం చూస్తే ఇట్టే అర్ధమవుతుంది
10. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు కేంద్ర ప్రభుత్వానికి st జాబితాలో చేర్చమని నివేదికలు పంపించింది?
A. 'లోగుట్టు పెరిమాళ్ళకెరుక' అన్నట్టు, ఏ ప్రభుత్వం, మనల్ని ST లో కలపమని నివేదిక పంపిందో, ఖఛ్చితమైన సమాచారం లేదు. ఈ విషయమై మన ముందు తరం వడ్డెర్లు సందిస్తే బావుంటుంది.
11. ఆ నివేదికలు ఎందుకు విఫలం అయ్యాయి? ఇప్పుడు మన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
A. నివేదికలు పంపడం మీదే మనకు క్లారిటీ లేనప్పుడు, అవి ఎందుకు విఫలమయ్యాయో చెప్పడం కష్టం. భవిష్యత్ కార్యాచరణ అంటే, AP లో బోయ/వాల్మీకి సోదరులు సాధించిన తొలి విజయాన్ని స్పూర్తి గా తీసుకుని ST కోసం ఉద్యమించడమే
12. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షులు ఎందుకు ఏకతాటిపైకి రావడం లేదు? మరి దీనిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
A. సమన్వయ లోపం కావచ్చు! కులం లోపల లేదా బయట ఎక్కువ శాతం నాయకులు, ప్రజల మధ్య అసమానతల్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటారు. ఇంత పెద్ద ఉద్యమం తరువాత రాష్ట్రం విడిపోయనప్పుడు, బాగా వెనకబడ్డ మన కులానికి, రెండు రాష్ట్రాల్లో ఐక్యత రావడానికి సమయం పడుతుంది. ఈ ఐక్యత వస్తే, దొంగ నాయకులకు కష్టాలు వస్తాయి కాబట్టి, అంత త్వరగా రానివ్వరు
13.ఇంత వరకు మనకు సరైన లీడర్ ఎందుకు లేడు? ఉంటే ఏవిదంగా సహకరించాలి?
A. తొంభయ్యవ దశకంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో, వడ్డెర్లు సాధించుకున్న కొన్ని డిమాండ్లను, మన కులం లోని కొంతమంది స్వార్ధపరులు బాగా వాడుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, కింద నలుగుతున్న, వడ్డెర్లను విస్మరించి, వడ్డెర్ల పోరాటాన్ని, క్వారీలకు మరియు కాంట్రాక్టులకు మాత్రమే పరిమితం చేశారు. ఎందుకు పోరాడుతున్నామో కూడా క్లారిటీ లేని పరిస్థితుల్లో, సరైన లీడర్ రావడం కష్టమే! కులం లో, క్వారీలు, కాంట్రాక్టుల కోసం మాత్రమే కాకుండా అందరికోసం, నిస్వార్థంగా పోరాడే, సరైనోడు వస్తే, మనం పూర్తి సహకారం ఇవ్వాల్సిందే👍
14. చాలా మంది అడుగుతున్న ప్రశ‌్న; వడ‌్డెర లలో కొందరు వాట్సప్ మరియు ఫేస్ బుక్ లకే పరిమితమా?
A. జియో పుణ్యమాని, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనక బడ్డ వాళ్లకు కూడా చవకగా అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది. వెనక బడ్డ కులం కాబట్టి, తొలి తరం డిజిటల్ వడ్డెర్లు, FB/Watsapp లలో ఎత్తిపోతల పధకంలో సమయాన్ని వృధా చేయడం సహజం. ఎత్తిపోతలు అంటే, పనికిరాని చెత్తను copy/paste/forward/share చేయడం. ఇవి క్రమేణా తగ్గి మనవాళ్ళు కూడా కుల విషయాలు మాత్రమే చర్చించే రోజు రాకపోదు. అంతవరకు, చెత్త పోస్ట్ చేసే వాళ్ళే హీరోలు! ఓపిక పట్టాల్సిందే😢
15. ఎందుకు మనం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాం? దీనికి పరిష్కారం ఏమిటి?
A. సమాజం మన పట్ల వహించిన నిర్లక్ష్యం మరియు మనలో సరైన నాయకత్వ లోపం వల్ల వడ్డెర్లు ఆర్ధికంగా మరియు సామాజికంగా వెనకబడ్డారు
16. మన వాళ్ళు ఎందుకు ఉద్యమ దిశగా రావడం లేదు?
A. దిశ లేని ఉద్యమానికి ఆదరణ కష్టమే! చదువుకున్నోళ్లు కులం పేరు చెప్పుకోవట్లేదు. బాగుపడ్డ ఇంకొంత మంది వడ్డెర్లు, వెనకబడ్డ మన కులాన్ని పనికట్టుకుని కన్ఫ్యూస్ చేస్తున్నారు. మనం రాజులమని కన్ఫ్యూషన్. ST/DNT/MBC కన్ఫ్యూషన్. రాబర్ట్ వాడేరా, ప్రభాస్, మైసూర్ రాజులు etc. మన వడ్డెర్లు అనే కన్ఫ్యూషన్. ఇంత కన్ఫ్యూషన్ ఉన్న కమ్మునిటీ లో ఉద్యమ దిశలో పయనం సుగమం కష్టమే!
17. ప్రపంచంలో మన కులం లేని దేశం లేదు మరి మనకెందుకు ఈ దుస్థితి?
A. చాలా మంది NRI వడ్డెర్లు కులానికి దూరంగా పారిపోతున్నారు. కష్టాల్లో/పెళ్లి/చావులకు మాత్రమే వారికి కులం గుర్తుకొస్తోంది. బాగుపడ్డ తరువాత ' మేం రాజూస్' అని చెప్పుకునే దుస్థితికి వచ్చాం😢
18.మనం రాజకీయంగా ఎందుకు ఎదుగలేదు?
A. కులం లోపలే, మనం పరిష్కరించుకోలేకపోతున్న ఇన్ని రుగ్మతలు ఉన్నప్పుడు, కులం లో ఒకరిద్దరు, కేవలం రాజకీయంగా ఎదగడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని నా అభిప్రాయం.
19. మనలో మనం ఎందుకు దూషించుకుంటున్నాం?
A. మనకు సరైన దిశ లేకపోవడం వల్ల, భిన్న స్వరాల తో పోరాడుతున్నాము కాబట్టి, ఒకరినొకరు దూషించుకోవడం జరుగుతోంది
- Log in to post comments