Skip to main content
Please wait...

గిద్దలూరు MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్

Submitted by vsss on 30, Oct 2019

VSSS వ్యూహాత్మక ST సాధన లో, పాలకులకు ఇచ్చిన ST వినతుల లోకల్ పేపర్ క్లిప్పింగులను సైతం భద్రపరిచి, అసలైన అంతిమ ఢిల్లీ పోరు డాక్యుమెంట్లో భద్రపరచడం కీలకం

Places related to ST Only Press Clips
Clipping Category

దర్శి MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్

Submitted by vsss on 6, Jul 2019

ప్రకాశం జిల్లాలో వడ్డెర్ల ST వినతులు జూన్ 22 వ తేదీనాడే ఆరంభం అయ్యాయి.

దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రకాశం లోని స్థానిక కుల లీడర్లే ఈ వినతులను లోకల్ పేపర్లలో రాకుండా అడ్డుకుంటున్నారు.

మన కుల సోదరుడు, తన్నీరు సురేష్ కుమార్ గారు, సమయం మరియు ప్రయాణ ఖర్చులు భరించి, లోకల్ వడ్డెర్లతో కలిసి, VSSS వెబ్సైట్ నుండి తెల్ల కాగితం 'ST ఓన్లీ' వినతుల PDFలు ప్రింటు చేసుకుని, వారి లెటర్ ప్యాడ్లపై ముద్రించి ఇప్పటికే ఆరుగురు ప్రకాశం MLAలకు ఇచ్చేసారు.

VSSS వ్యూహాత్మక ST సాధన లో, పాలకులకు ఇచ్చిన ST వినతుల లోకల్ పేపర్ క్లిప్పింగులను సైతం భద్రపరిచి, అసలైన అంతిమ ఢిల్లీ పోరు డాక్యుమెంట్లో భద్రపరచడం కీలకం.

ప్రకాశం వినతులన్నీ లోకల్ పేపర్లలో వచ్చెట్టు ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో మీరు కూడా సాయం చేస్తారని ఆసీస్తూ,

మీ సోదరి,

Dr. Chandrakala Jeripeti
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి

Places related to ST Only Press Clips
Clipping Category

ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు, కడప MLA శ్రీ అంజాద్ బాషా గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు

Submitted by vsss on 6, Jul 2019

డ్డెర్ల ST సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ ఓర్సు శ్రీనివాస కుమార్ రాజు మరియు స్థానిక వడ్డెరలు, ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు, కడప MLA శ్రీ అంజాద్ బాషా గారిని కలిసి, వడ్డెర్ల న్యాయమైన ST డిమాండు గురించి వివరించారు. AP లో వడ్డెర్లను ST లో కలుపడానికి, స్టడీ కోసం ఇప్పటికే మొదలు పెట్టిన సత్యపాల్ కమిటీ పర్యటనలు వేగవంతం చేసి, వడ్డెర్లను ST లో చేర్చే విధంగా తీర్మానం చేసి ఢిల్లీ కి పంపే కృషి చేయాలని విన్నపించుకున్నారు. MLA గారు కూడా, ఈ ప్రక్రియలో తన వంతు కృషి చేస్తామని చెప్పడం పట్ల నియోజకవర్గ వడ్డెరలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో, స్థానిక సీనియర్ వడ్డెర నాయకుడు. బత్తల శ్రీనివాస్ గారు మరియు పలువురు లోకల్ వడ్డెర్లు పాల్గొన్నారు.

AP లో MLA లకు 'ST ఓన్లీ' వినతులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ లో ఇప్పటికే వినతులు ఇస్తున్నారు. 50 ఏళ్లుగా, ఉమ్మడి రాష్ట్రంలో, మనకు చేజారిన హక్కును, ప్రాంతీయ దృష్టితో చూడటం దౌర్భాగ్యం😢

పాలకులకు ST వినతులు మరియు ఆ వినతుల వివరాలు, లోకల్ ప్రింట్ మీడియాలో ప్రచురణ మన వ్యూహాత్మక పతాక స్థాయి ఢిల్లీ పోరుకు కీలకం కానున్నాయి👍

అన్ని జిల్లాల వినతులు 10 రోజుల్లో పూర్తి చేసి VSSS వెబ్సైట్ లో పెట్టేస్తాను. రెండు రాష్ట్రాల MP వినతులు కూడా అదే సమయానికి సిద్ధం చేస్తాను

స్థానిక కుల సోదరులు, ఈ వినతులు ఇస్తే, ST హక్కు పోరుకు ఊతం లభిస్తుంది

Please help ourselves to achieve our lost ST right

Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
www(dot)vsss(dot)info

Places related to ST Only Press Clips
Clipping Category
Subscribe to AP MLA