Skip to main content
Please wait...

జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి

NOTE: Please download the PDF(s)/Document(s) related to this content to get a better understanding

To,

శ్రీ K. పవన్ కళ్యాణ్ గారు,

జనసేన పార్టీ ప్రెసిడెంట్,

జనసేన పార్టీ కార్యాలయం, హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్రం

From, తెలుగు రాష్ట్రాల వడ్డెరలు

గౌరవనీయులైన జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి,

విషయం: పూర్తిగా వెనకబడ్డ శ్రామిక మరియు సంచార వడ్డెరల న్యాయమైన ST డిమాండ్ను జనసేన మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు మీ పార్టీ పై ఉంచినవిస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము

అయ్యా, వడ్డెర మరియు వివిధ పేర్లతో, భరత ఖండం అంతా విస్తరించియున్న మేము,
దేశంలోని కట్టాడాలన్నీమా రక్తం మరియు చెమటతో నిర్మించిన, అతి పెద్ద సంచార, నిర్మాణ శ్రామిక తెగలము. 
బ్రిటిష్ పాలనలో, మమ్ములను, నేర జాతులుగా(క్రిమినల్ ట్రైబ్స్) ముద్రించడం వల్ల, క్రమంగా, సాంఘిక దోపిడీకి గురికాబడ్డాము. ఇలాంటి తెగలకు, స్వతంత్రానంతరం, 1952 లో DNT లుగా పేరు మార్చినప్పటికీ, చెప్పుకోదగ్గ చేయూత లభించక, మేము, అన్ని రంగాల్లో వెనకబడిపోయాము. పలు SC/ST యాక్టుల ద్వారా, దేశంలోని 70% రాష్ట్రాల్లోని వడ్డెరలు, ఇప్పటికే SC/STలుగా గుర్తింపు పొందియున్నారు.

1976 SC/ST యాక్టువరకు, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ఎరుకల, యానాది, లంబాడీ వంటి DNT లను, STలు గా గుర్తించి, మా వడ్డెర్లను మాత్రం విస్మరించడంతో, BC లుగానే మిగిలిపోయాము. 
అప్పటి నుండి, మా తెలుగు వడ్డెర్లు, వారికి న్యాయంగా రావలసిన ST హక్కు కోసం, పోరాడుతూనే ఉన్నారు ఏ కులం లో లేనటువంటి, శారీరక హింస మరియు ప్రాణాపాయ ప్రమాదాలతో కూడిన వృత్తి లో ఉన్న మా వడ్డెరలకు, BC లో అందించే చేయూత చాలక, వృత్తి సంబంధిత సాంఘిక సమస్యల ఊబిలో చిక్కుకు పోతున్నాము. 
విద్య, ఆర్ధిక, ఉపాధి మరియు రాజకీయ రంగాల్లో వెనకబడ్డ మేము, చెప్పుకునే దిక్కులేక పోవడం వల్ల, 
సంఘంలో దాడులకు కూడా గురి అవుతున్నాము.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది వడ్డెర యువత,మీ అభిమానులుగా ఉంటూ, మీ పార్టీ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. 
మా బ్రతుకులు బాగు పడాలంటే, నిర్దిష్ట వనరులు సమకూర్చి, మెరుగైన విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ తో పాటు, 
మాకు అట్రాసిటీ చట్ట రక్షణ కూడా ఇవ్వగల మరియు మేము న్యాయంగా ఉండవలసిన ST జాబితాలో మమ్ములను చేర్చే విధంగా, 
మా ST డిమాండ్ను జనసేన మానిఫెస్టోలో చేర్చి, లక్షల వడ్డెర్లు, మీ పార్టీ పై ఉంచిన విస్వాస రుణాన్ని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములతో,
ఇట్లు, తెలుగు రాష్ట్రాల వడ్డెరలు
Note: పేరు, ఫోన్ నంబర్ మరియు సంతకాలతో కూడిన పత్రాలను/ST అర్హత డాక్యుమెంట్లను ఈ విజ్ఞప్తికి జత చేస్తున్నాము.