(వడ్డెర్లకు ST పోరును నీరుగార్చే, ఒక అన్యకుల BC సోదరుడి తో వాట్సాప్ లో జరిగిన సంభాషణ, కొన్ని లాజిక్కులు మరియు వాటిపై నా వివరణ)
[07/10, 12:22 PM] +91 xxxxxxxx బిసి OSK Raju గారు, మీకు ST లో ఛాన్స్ వస్తీ ఎక్కువగా మేము ఆనంద పడతాము.
కానీ అందులో వున్నవారు, మిమ్ములను లోనికి రానివ్వరు. ఎందుకంటే, వారి నిస్పట్టీ కి ఆటంకము కలుగుతుంది. వారిని తక్కువ అంచనా వేయవద్దు. మన బీసీల నుండి ఎవ్వరినీ ST ల్లోనికి రానివ్వరు. మనకు తెలియని రాజ్యాంగంలోని ఒక మర్మము చెబుతాను వినండి. ఎవరైనా SC / ST or BC (OBC) గ్రూప్ లకు సంబంధించి మార్పులకు, అదే కేటగిరీలో వున్న మిగతా వారు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి అని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ నీ చూడండి. కేంద్ర ప్రభుత్వం లో వున్నవారు, రాష్ట్ర ప్రభుత్వం లో వున్నవారికి ఈ విషయము తెలుసు. దీనిద్వారా మనలను కట్టడి చేసి, మనకు తెలియకుండానే చుక్కలు చూపిస్తున్నారు. రిజర్వేషన్ల ఆర్టికల్స్ లో ఇలా చాలా వాటిని, అంబేత్కర్ చూపించిన రిజర్వేషన్స్ లో, మన పిల్లల ఎదగుదలలో ఆటంకాలు, ఆనాటి పాలకులు కాంగ్రేస పార్టీ పెద్దలు ఇలాంటివి సృష్టించారు. మనలను తొక్కిపెడుతున్నారు. కనుక ప్రతీ బిసి నాయకులు, మన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మరువరాదు. పాలకుల రాజకీయ మోసాలను నమ్మకండి. 35 సం: లుగా బిసి సంగాలలో బ్రతుకు తున్నాను.మీరు ఎదిగితే మేము సంతోచిస్తాము అని మీకు తెలుసు. మీ XXXXXX. విజయవాడ.
[07/10, 3:56 PM] OSK Raju: *XXXXXX గారు, వడ్డెర్లకు రావలసిన SC/ST ఛాన్స్, అనడానికి ఇది గ్యాంబ్లింగ్ కాదు సార్!
మాది న్యాయమైన కోరిక! ST రాదు అని, మీరు చెప్పిన లాజిక్కులన్నీ మా కుల మిత్రులు కూడా చెప్పారు. అందరినీ, డిటైల్డ్ గా సమాధాన పరచాము! మీక్కూడా కొద్ధిగా వివరిస్తాను. మేము భారతావనిలో 70 శాతం SC/ST లుగా ఉన్నప్పటికీ, వారు రానివ్వరు అన్నది నాణ్యానికి ఒక వైపే! సంఖ్య మరియు అర్హతలు కాకుండా, పూర్తి స్థాయి ప్రజా పోరాటంతో, నిష్పత్తులు తీసి/ కలిపి, టోటల్ రిజర్వేషన్ దెబ్బ తినకుండా ప్రభుత్వాలు చేయాలి! లేదా చేయిస్తాం!
ఎవ్వరూ, ఎవరినీ తక్కువ అంచనా వేయడం లేదు! సంఖ్యా బలం తో, కాపు సోదరులు వందల కోట్ల కార్పొరేషన్ తీసుకుని, ఈ రోజు BC రిజర్వేషన్ సాధించే దిశలో కూడా BC లను వారు తక్కువ అంచనా వెయ్యడం లేదు! మీరు చెప్తున్న ఆ మర్మం గురించి ఆలోచిస్తే, మీలాంటి వారు మా ST పోరుకు ఓకే, అని ఇందాకే అన్నారు👌
నెక్స్ట్, అభ్యంతరాలు ఎలాగూ ఉంటాయి; తెలంగాణా పోరు లాగా! వ్యూహాత్మక విజయాల్లో, కొందరికి భాధ కలగడం కూడా సహజమే! ఇంకా బ్రిటిష్ పాలన నుండి, మాకు జరిగిన CT/DNT అన్యాయం, సిద్దాపురం క్రిమినల్ రిహాబిలిటేషన్ సెంటర్లు, 1976 లో సాటి CT లను ST లో కలిపి మమ్ములను ST లో కలుపకపోవడం, మా వడ్డెర ప్లాస్టిక్ లేబర్ బస్తీలు వగైరా లు చెప్పాలని ఉంది! కాని, మీరు వినరు అని గట్టి నమ్మకం😢
శారీరక హింస తో కూడిన వృత్తి వల్ల హెచ్చుమీరిన తాగుడు, విచ్చిన్నమై కుటుంబ మరియు సాంఘిక జీవనం మా ST పోరాటాన్ని బలపరుస్తాయి! అయితే, మాలో కొందరి రాజుల పోకడలు, వాస్తవ జ్ఞాన లేమితో, BC ల్లో పాతుకు పోవాలన్న ఆలోచనలు, రాజకీయ పదవులే అన్ని భాదలకు పరిసావేదిని(అంబెడ్కర్ చెప్పిన, అంతరించిపోవడాన్ని, నేను డార్విన్ సిద్ధాంతాలతో పోల్చడం లేదు సార్) ఉద్యమాన్ని నీరు కారుస్తున్నాయన్న మాట కూడా వాస్తవం😢
మాది నాయకులు ప్రేరేపించిన పోరాటమైతే, ఇంత రాసిన దానికి అకౌంట్లో డబ్బులు పడాలి! ఇది సామాన్య వడ్డెరల ఆకాంక్ష! దయచేసి, మా కుల పరిస్తుతులు మరియు రెండు శతాబ్దాల అన్యాయం తెలుసుకోకుండా, మీ జనరల్ BC లాజిక్ తో, మా ST పోరాటం ఫెయిల్ అవుతుందని చెప్పడం బాధాకరం!*
Please Think Dr. OSK Raju
9550136660
- Log in to post comments