chandrakala Jeripeti: *తెలుగు వడ్డెర్ల రాజకీయవాటా ఎలాసాధించుకోవాలి* ?

by జెరిపెటి చంద్రకళ

2019 లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలుజరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతలేదన్నా 40లక్షల పైచిలుకు వడ్ఢర్లు ఉన్నా, ఇప్పటిదాకా, ఇద్దరు మాత్రమే ఈ కులంనుండి ఉమ్మడి రాష్ట్రం లో MLA లు అయ్యారు.

AP లో 139(36 sc/st మినహా) సీట్లు మరియు TS లో 96(23 sc/stమినహా) సీట్లు కలిపితే 235 సీట్లలోవడ్డెరలు కనీసం 20 సెగ్మెంట్లలోబరిలోకి దిగి కనీసం 10 సీట్లు కేవలం వడ్డెర్ల ఐకమత్యం తో బయటి వారిసహాయం లేకుండా,కూడా మనవారు గెలవగలరు అని అనుకుంటున్నాను. 

ఇది నా అభిప్రాయం!

అలాగే, 2019 ఎన్నికలలో BC లకుఅన్నిపార్టీలు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం ఖాయం!

ఇది జరిగే లోపు, మనముగెలవదగిన లేదా ఇతరులవిజయావకాశాల్ని మార్చగలిగిన  నియోజకవర్గాల్లో, ఐక్యత సాధించి, ప్రముఖ పార్టీలు టికెట్లు ఇచ్చే సమయానికి మనం కొంతమంది మన అభ్యర్ధులను బలోపేతం చేసి, మన ఐకమత్యం సత్తాను, క్షేత్ర స్థాయిలో చూపిన్చాలి. మనము నిర్ణయించిన మన అభ్యర్థులకు, పార్టీలకు అతీతంగా మనము పూర్తి స్థాయి సహాకారం(మేధ,అంగ మరియుఆర్ధిక సహకారం సైతం) అందించగలగాలి.  ఒక వేళ, మన రాజకీయ ప్రాముఖ్యతను, ప్రముఖ పార్టీలు పట్టించుకోకపోతే, స్వతంత్ర(ఇండిపెండెంట్) అభ్యర్థులుగా సైతం పోటీలో దిగి, వడ్డెర్లను గుర్తించకపోవడం వల్ల, అక్కడి అభిర్ధుల జాతకాలను సైతం వడ్ఢర్ల ఐక్యత తారుమారు చేస్తుందన్న విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే ఈ డాక్యుమెంట్ ఉద్దేశం!

 *ఎలా* ? *How can this be possible* ?

ఎలక్షన్లు కరెక్ట్ గా ఒక సంవత్సరంఉండొచ్ఛు అన్నది లేటెస్ట్ న్యూస్. 

మే 2019 లో జరుగుతాయి అనుకుంటే మనకు ప్లానింగ్ కోసం  సుమారు 10 నెలలు ఉన్నట్టు. అందులో ఒక నాలుగు నెలల ముందే ప్రముఖ పార్టీల అభ్యర్థుల పేర్లుప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మనకుమన నియోజక వర్గాలను మరియు అభ్యర్థులను ఫైనల్ చేయడానికి కేవలం 6 నెలల సమయం మాత్రమే ఉంది.

 *ఈ ఆరు నెలల్లో ఏం చేయాలి* ?

ముందుగా ఈ ఆరు నెలల్ని మూడుభాగాలుగా విభజించి, మన ప్రణాళికను 3 ఫేజులు గా విభజించుకోవాలి.

 

 *ఫేజ్ 1(మే 15 నుండీ జులై 15 వరకు):* 

రాష్ట్ర వ్యాప్త 'వడ్డెర 2019 ఎన్నికల కమిటీ' ని తయారు చేయడం మరియు మనవారు గెలుపొందే 20 నియోజక వర్గాలను గుర్తించి, గెలుపు అవకాశాల ర్యాంకులు ఇవ్వడం. 

 *ఫేజ్ 2(జులై 15 నుండి సెప్టెంబర్ 15వరకు):* 

ఈ 20 నియోజక వర్గాలనుండి 60 మంది(ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురుచొప్పున) ప్రాధమిక అభ్యర్థుల జాబితా తయారు చేయడం.

 *ఫేజ్ 3(సెప్టెంబర్ 15 నుండి నవంబర్15 వరకు):* 

20 నియోజక వర్గ కమిటీలను ఖరారు చేసి, గెలుపు ప్రణాళికలను సిధ్ధం చేయడంమరియు ప్రతి నియోజక వర్గం నుండి ఒకఅభ్యర్థిని పార్టీలకు అతీతంగా ఎన్నికలకు సిద్ధం చేయడం.

ఇప్పుడు ప్రతి ఫేజ్ ను క్లుప్తంగా వివరిస్తాను.

 *Note* : AP నుండి వడ్డెర ఓటర్ల ఎస్టిమేట్ ఇప్పటికే తయారు గా ఉంది. ఇదే ఎస్టిమేట్ను మనం TS కు కూడా రెడీ చేయాలి

 *ఫేజ్ 1:* 

మొదలు మనం 'రాష్ట్ర వడ్డెర ఎన్నికల కమిటీ' ని తయారుచేసుకొని కార్యవర్గసభ్యులను ఎన్నుకోవాలి.

AP లో 13 జిల్లాలకు కలిపి ఒక 20 మంది సభ్యులు ప్లస్TS పాత 9 జిల్లాలకు కలిపి 20 మందిసభ్యులకు మించక పోతే కార్యాచరణసులభం అవుతుంది. ఇందులో ఎవరుఉండాలి? ఒక్క ముక్క లో చెప్పాలంటే, కులానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి సమయస్ఫూర్తితో కుల రాజకీయ పోరాటదృక్పధాన్ని నిర్దేశించే వారు ఈ కమిటీలోఉండాలి. వీరు నైసర్గిక, రాజకీయ, సాంఘికవిషయ జ్ఞానులై, సంఘాన్ని గౌరవిస్తూ, అంతర్లీనంగా కులానికి పాటు పడే వాంఛకలగినవారై ఉండాలి. 

ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ కార్య వర్గ నిర్ణయమే కులానికి  సాంఘిక శాసనమ్ కాబట్టి, వీరిలో స్వలాభాపేక్ష ఉండ రాదు. 

సాంఘిక జ్ఞానంకలిగిన విద్యావంతులు 15 మందికి తక్కువకాకుండా ఉండాలి. మిగిలిన 5 గురు కులవ్యాపార, రాజకీయ వేత్తలు ఉండవచ్చు. మొత్తమ్మీద 5 గురు మహిళలు కూడాఉండవలసిందే! 

ఇలాంటి కమిటీ ని నిర్మించడం కష్టమే కానీఅసాధ్యం కాదు.L

జూన్ 2018 మాసంలోకమిటీ నిర్మాణ ప్రక్రియ పూర్తికావాలి. మే 15 నుండే, మన కుల వాట్సాప్ గ్రూపులలోఓటింగ్ ద్వారా ఈ కమిటీ సభ్యులను ఎన్నుకోవచ్చు.

 *కమిటీ కి కావలసిన వనరులు:* 

ఈ తాత్కాలిక కమిటీ సభ్యుల వాలంటరీ సేవలు అమూల్యం మరియు వెలకట్టలేనివి! అయితే, కమిటీ సభ్యుల ఎన్నికల సేవలకు సంబంధించిన వస్తు ఖర్చులు మాత్రం కులం భరించక తప్పదు. కమిటీ పేరిట ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి విరాళాలు(కులం నుండిమాత్రమే) శ్వీకరించాలి. నా వంతు గా ఓ 5000 రూపాయలు, జూన్ మొదటి వారంలో డిపాజిట్ చేస్తాను. కమిటీ సభ్యుల పర్యటనల, మరియు బసల  ఖర్చులు కూడా కుల బాధ్యత కాబట్టి, వీటిని తగ్గించేవిధంగా కుల సభ్యులు వీరికి ఆతిధ్యాలు కల్పిస్తే చాలా ఖర్చులు తగ్గినట్టే! ఇవికాక స్టేషనరీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఫోన్ మరియు ఇతర ఖర్చులు సభ్యులే భరించుకోవాల్సి ఉంటుంది!

 *కమిటీ సభ్యుల వాలంటరీ బాధ్యతలు:* 

1)  june 2018 మొదటి మీటింగ్(రాజధానిలో) మొదలు, ఎన్నికలు అయ్యే వరకు ప్రతినెల మొదటి ఆదివారం ఒక సమీక్షా మీటింగ్(అవసరాన్ని బట్టి స్థలంనిర్ణయించుకుంటారు) ఏర్పాటు చేసుకుని, వోటింగ్ ద్వారా ముఖ్య నిర్ణయాలుతీసుకోవాలి. ఏ మీటింగ్లో కూడా 15 మందిసభ్యుల కు తక్కువ కాకుండా హాజరు ఉండాలి.

2) సభ్యులు పరస్పర సంభాషణల ద్వారా నిత్యం సంప్రదింపులు జరుపుతూ, ప్రతి ఆదివారం టెలిఫోన్ కాన్ఫరెన్స్ సమీక్షనిర్వహించి, నిర్ణయాలను 'కమిటీ వాట్సాప్గ్రూపు' మరియు www.vadderatimes.com  లోఅప్డేట్ చెయ్యవచ్చు!

3)అన్నిటి కన్నా ముఖ్యం, కమిటీ సభ్యులుసాటి కుల సభ్యుల సూచనలనుశ్వీకరించడానికి ఎల్ల వేళలా సిద్ధంగాఉండాలి

 *కమిటీ సభ్యులకు కులం ఇవ్వవలసినగౌరవ సహకారాలు:* 

కమిటీ సభ్యులు స్వలాభాపేక్ష లేకుండా కులానికి వారి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి వారికి మన పూర్తి సహకారం అందించాలి. వారిని మనమే ఎన్నుకున్నాము  మరియు వారి నిర్ణయాలు వోటింగ్ ద్వారా తీసుకోబడతాయి కాబట్టి, వారికి మంచి నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను మనము కల్పించాలి. ఏదైనా విభేభించాలి అంటే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయాలి. ఏ కారణం చేతయినా సభ్యుడి స్థానము ఖాళీ అయినా లేకసభ్యుడిని మార్చ వలసి వచ్చినా, మళ్ళిఅందరి అభిప్రాయాలు (వాట్సప్ ద్వారా) ఓటింగ్ ద్వారా తీసుకుని ప్రొసీడ్ కావలసివుంటుంది.

ఎన్నకల ఫలితాలు వచ్చిన తరువాత, ఈ కమిటీని ఎక్స్టెండ్ చేయడమో లేక డిసాల్వ్ చేయడమో, ఆ రోజు పరిస్థితులను దృష్టిలోఉంచుకుని చేయడం జరుగుతుంది.

అలాగే, కమిటీ  విరాళాల/ఖర్చుల నెలవారి అకౌంట్స్ కూడా గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

 *మొదటి కమిటీ మీటింగ్ మరియుగెలిచే నియోజక వర్గాల ఎంపిక:* 

మొదటి మీటింగ్ లోనే మన వడ్డెరుల ఓటరుశాతం నియోజక వర్గ వారిగా లిస్టింగ్ కసరత్తు ప్రారంభించాలి. ఇప్పటికే జిల్లాలవారీగా ఉన్న సంఘాలు, సొసైటీలు చేసే కులసేవకులు, లోన్లు మరియు కార్డులు ఇప్పించేకుల సేవకులు, లేబర్ నాయకులు ఈవిషయం లో కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. వీరి సహకారంతో, ఆ సమయానికి TS లోనిఅన్ని నియోజకవర్గాల వడ్డెర ఓటర్వివరాల సంఖ్యలు కూడా సేకరించడం అయిపోవాలి.

ఈ వివరాలతో ప్రతి రాష్ట్రం నుండి 10 మనవారు గెలిచే, నియోజక వర్గాలుఎన్నుకోవాలి. ఆ తరువాత, ఒక వేళ ఆనియోజక వర్గాల్లో SC/ST రిజర్వుడు ఉంటే, వాటిని మినహాయించి, వడ్డెర శాతంలిస్టులోని తరువాత వచ్చే నియోజకవర్గాలను లిస్టు లో చేర్చాలి. జులై 15 వ తేదీలోపు ఈ లిస్ట్ రెడీ గా ఉండాలి.

 *ఫేజ్ 2:* 

ఇక్కడి నుండే కమిటీ సభ్యుల అసలయినకుల రాజకీయ నిర్ధేశం ప్రారంభంఅవుతుంది!

ఒక్కో నియోజక వర్గం నుండి ముగ్గురు, కులానికి కూడా ఉపయోగపడే ప్రజానాయకులను గుర్తించడం!

కుల ఓటర్లు ఎక్కువగా ఉన్న  ప్రాంతాలు కాబట్టి ఖఛ్చితంగా ఇక్కడ ఆల్రెడీ కులనాయకులు ఉంటారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో నియోజకవర్గ కుల సభ్యుల అభిప్రాయాల్ని సేకరించకుండా, ముగ్గురిని ఫైనల్ చేయరాదు. అంటే, కమిటీ సభ్యులు, ఈ 10 నియోజక వర్గాల్లో పర్యటించిన తరువాతే, వోటింగ్ ద్వారా ఈ ముగ్గురి పేర్లు డిసైడ్ చేస్తారు.

 *కమిటీ సభ్యులు, క్షేత్ర స్థాయిఅభ్యర్థుల సర్వేలో పరిగణించవలసిన అంశాలు (క్రమంలో):* 

1)ఈ లోకల్ అభ్యర్థికి కులం గురించి, కులానికి గడచిన శతాబ్దంలో జరిగిన అన్యాయం గురించి మరియు కులానికి కావలసిన ST రిజర్వేషన్ గురించి పూర్తిఅవగాహన ఉండాలి.

2)నియోజక వర్గంలో, కులం లో అందరికి తెలిసిన వాడై ఉండాలి.

3)నియోజక వర్గ సమస్యలపై అవగాహనఉండాలి. నియోజక వర్గంలోని ఇతర మత, మరియు కులస్తులతో(ముఖ్యంగాBC/SC/ST మరియు మైనారిటీలతో)సత్సంబంధాలు కలిగి ఉండాలి.

4)పై గుణ గణాలు ఉన్న తరువాతే అభ్యర్థి ఆర్ధిక, అంగ స్తోమతలను పరిగణలోకితీసుకోవాలి

5)అన్నిటి కంటే ముఖ్యం: కమిటీ కిసహకరించాలి మరియు కమిటీ తీసుకున్న తుది నిర్ణయంలో తనకు అవకాశం రాకపోయినా కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థికి అన్ని విధాలా సహకారాన్నిఅందించాలి.

 *అసలు ఇవన్నీ ఎందుకుపరిగణనలోకి తీసికోవాలి అనేప్రశ్నను కూడా మనం సమాధానపరచాల్సి ఉంది!* 

కులం ఈ అభ్యర్థులు గెలిచేవరకు పూర్తిస్థాయి సహకారం అందిస్తుంది కాబట్టి, వారు గెలిచిన తరువాత నియోజకవర్గసమస్యలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే, వడ్ఢర్ల సమస్యలపై అంతర్వాహిని లాపోరాడుతూ, రాష్ట్ర మరియు జాతీయస్థాయి వడ్డెర నాయకులుగా ఎదగాలి.

ఇదేం కొత్త విషయం కాదు! 

రాజకీయంగాఎదిగిన కులాలన్నీ వారి నాయకులను ఇలాగే మలచి వారి కులాభివృద్దికి దోహదంచేసుకుంటున్నారు. ఈ సారి మనమ్ కూడా ఇలా చేస్తున్నాం! అంతే తేడా!

 *ఫేజ్ 3:* 

అక్టోబర్ 2018 సమయానికి, ఆ నియోజకవర్గాల్లో, కమిటీ నిర్ణయించిన సభ్యులు సఖ్యత గా ఉండి కుల విజయానికి వ్యూహరచన చేయాలి. అంతే కాదు, అప్పటికే వివిధ పార్టీల లో విస్వాసంతో పనిచేస్తున్నవడ్డెర నాయకులు సైతం, కమిటీ చేస్తున్న ప్రక్రియను గౌరవించాలి. వారు కూడా మనఅభ్యర్థులుగా అర్హులే! అయితే, వారు కూడా కమిటీ నిర్ణయాలను కుల ప్రయోజనాలదృష్ట్యా గౌరవించ వలసి ఉంటుంది. అయితే, ఇప్పుడు నెలకొన్న కుల రాజకీయపరిస్తుతుల దృష్ట్యా, కొంత మంది వ్యక్తి గత విస్వాసం, పార్టీ విస్వాసం, ధన  మరియు నామినేటెడ్ పదవుల ప్రలోభాల వల్ల కులభవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది.

కాబట్టి, అలాంటి నాయకులను, కమిటీ ప్రోత్సహించదన్న విషయాన్ని కులం మొత్తం గుర్తించడమే కాదు, ఇలాంటి కఠోరనిర్ణయాలలో కమిటీకి బాసటగా కూడా నిలవాలి.

కమిటీని గౌరవించకుండా లేదా కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎవరైనా తమ ధన, అంగ మరియు రాజకీయ బలంతో అభ్యర్థులుగా బరిలోకి దిగడాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరూ ఆపలేరు.    

ఒక వేళ అలా ఎక్కడైనా, ఈ అవాంఛనీయమైన స్థితి నెలకొంటే, అలాంటి వడ్డెర అభ్యర్థులకు కులము ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదు. అంతే కాదు, అట్టి వారికి పోటీగాకులం అండదండలు కల సభ్యులను నిలబెట్టడం చేయకపోతే, వ్యక్తులే కులంకంటే పెద్ద శక్తులు గా మారి కులాన్ని వెనక్కుతీసుకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.

ఇంత నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోతే, పార్టీలు సైతం మన వారిని విభజించి, మనలని మళ్ళి ఓటు వేసే యంత్రాలుగా మార్చేస్తారు. ఇంత ప్రణాళిక లేకపోతే, మనకుమొక్కుబడిగా, గెలవలేని స్థానాలు కేటాయించి, చేతులు దులుపుకుంటారు.

 *వడ్డెరల లో ఇంత ఐకమత్యం వస్తే, పాలకులు ఊరుకుంటారా* ?  

మన వారిలో ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఇప్పటికే వాడుకుంటున్న నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎన్నో ఎత్తులు వేస్తారు. 

ఇవన్నీకూడా ఈ ప్రక్రియ లో భాగంగా తిప్పికొట్టగలగాలంటే, స్వచ్ఛమైన కమిటీ తోబాటు  స్వచ్ఛమైన అభ్యర్థులు కూడా రావలసిన అవసరం మన కులానికి ఎంతైనాఉంది.

ఇలా చేస్తే, నవంబర్ 2018 సమయానికిమన నియోజక వర్గాలు, అభ్యర్థులు మరియు రాజకీయ వ్యూహాలు సిద్ధంగాఉంటాయి.

 అప్పటికే వడ్డెర్ల ఐక్యత సభలు నియోజక వర్గ స్థాయిలో నిర్వహిస్తాంకాబట్టి, మనల్ని రాజకీయ పార్టీలు గుర్తించకతప్పదు. అలా జరగకపోయినా మనం స్వతంత్ర అభ్యర్థులుగా దిగి, గెలుపుఓటములను శాసిస్తూ మన ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి, మన రాజకీయ పోరాటంలో తొలి ఐక్యవిజయం సాధించినట్టే

 *అంతా OK! ఈ ధన రాజకీయ పోరాటంలోమన అభ్యర్థులను మనము ఎలాగెలిపించుకుంటాము* ?

అవును! ఇదే కీలక దశ.

ఈ కసరత్తు మనము డిసెంబర్ 2018 నుండేప్రారంభించాలి. 

 *రెండు రాష్ట్రాలు, 30 లక్షలపై చిలుకు వడ్డెర్లు, 20 స్థానాలు, పార్టీలకుఅతీతంగా మన 20 మంది అభ్యర్థులనుమనము గెలిపించాలి! ఎలా* ?

ఐకమత్యం, కుల చైతన్యం కోసం నియోజకవర్గ కుల కమిటీలు సెప్టెంబర్2018 నుండే కృషి చేస్తాయి. 

ఇందులోయువత ముఖ్య పాత్ర పోషించేట్టు ఎన్నికలపోరాట కమిటీ కృషి చేస్తుంది. 
వీరిది ఒకటేఉద్దేశ్యం! 

పార్టీలకు అతీతంగా కుల ఓట్లు మొత్తం కమిటీ బలపరచిన ఆభ్యర్ధికి పడేలా చేయడం. 

ఆపై మిగతా కులాల ఓటర్లనుసైతం మన అభ్యర్ధులకు ఓటు వేసేలా ప్రయత్నించడం.

మన పటిష్టమైన యువత, ఎన్నికల కమిటీ ఆధ్వర్యం లో ఇంత వరకు మనకుసహకరిస్తుంది! ఇందులో అనుమానాలు అవసరం లేదు కూడా

ఇవన్నీ అమలు పరచాలంటే, అతిముఖ్యమైనది డబ్బు! అది లేకనే, కులం లోఉన్నత భావాలున్న నాయకులు సైతం రాజకీయ పోరాటాల్లో విఫలమవుతున్నారు.

ఇందుకు కూడా మార్గం లేకపోలేదు!

వడ్డెర ఎన్నికల కమిటీ కరెంట్ అకౌంట్ లొనేమనము అభ్యర్థుల గెలుపుకై విరాళాలు శ్వీకరిద్దాము. .   

కమిటీ అభ్యర్ధన మేరకు, కులవిజయ అవకాశం కోసం, ప్రతి ఒక్కరుముందుకు వచ్చి సహాయం చేస్తారనిఆశిద్దాము.

30 లక్షల పైచిలుకు వడ్ఢర్లలో, కనీసం ఒక 5 లక్షల మంది వడ్ఢర్లు, ప్రతి ఒక్కరూ 50 రూపాయలకు తగ్గకుండా సహాయం చేసినామనము 2.5 కోట్లు జమ చెయ్యవచ్చు. దీన్నిమనము నియోజక వర్గ అవసరాలు మరియు గెలుపు ఓటముల అవకాశాలకు అనుగుణంగా, ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలోఖర్చు చెయ్యవచ్చు!

 *ఇలాంటి పక్కా ప్రణాళికతో వెళితే, కొండలను సైతం పిండి చేయగల మనవడ్ఢర్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక పది MLA సీట్లు సాధించుకోవడం పెద్దకష్టమేమీ కాదు*

ఓ పది మంది MLA లను మాత్రమే కాదు, 2019 ఎన్నికలలో, ఓ ఇద్దరు వడ్డెర MP లనుకూడా ఇదే ప్రణాలికను అమలు చేసితయారు చెయ్యవచ్చు!

ఆయితే, ఈ మధ్యలో నామినేటెడ్ ప్రలోభాలకు లొంగితే, మాత్రం ఇది సాధ్యంకాకపోవచ్చు. ఈ ఎన్నికల్లో ఈ ఎలెక్టెడ్ పదవులు సాధిస్తే, ఎన్నో నామినేటెడ్ పదవులు వచ్చే ఎన్నికల(2023) లోపే సాధించు కోవచ్చు.

అంతెందుకు! ఈ ప్రణాలికను, మనము నవంబరు 2018 వరకు అమలు చేస్తే, అన్ని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ మన కుల ఐకమత్యం గురించి డిల్లీ వరకు చేరవేస్తాయి. అప్పుడు, మన కుల డిమాండు అయిన ST కూడా సాధించు కోవడం సులభం అవుతుంది.

ఇక చివరిగా, సాటి BC లతో మన వ్యవహారశైలి మాత్రం బోయలను పోలి ఉండాలి. 

అన్యాయంగా BC లో వేయబడి ఇప్పటికీ అత్యంత వెనక బడ్డ BC-A లుగా ఉన్న మనం, స్థాన భ్రంశం చెందిన BC లుగా, ఉంటూ, BC బెనిఫిట్స్ కూడా పొందుతూ, ST కోసమే పోరాడుతున్నాము అని ప్రతిప దం లో చెపుతూ, మన ST పోరాటానికి, సాటి BC ల మద్దతు కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. 


రాజకీయంగా పొత్తులతో ఎన్ని సామాజిక వర్గాలతో చేతులు కలిపినా, వడ్ఢర్లకు మాత్రం ST కావాలి అనే కోరికను అన్ని కులాల చెవుల్లో మారు మోగించడం మాత్రం ఆప కూడదు.

ఇవన్నీ నా ఆలోచనలే కాదు: నాతోమాట్లాడిన చాలా మంది కులబంధువుల అభిప్రాయాలు కూడా

ఈ రాజకీయ పోరాటంలో నా వంతు కృషిగాఈ డాక్యుమెంట్ ను రాసి pdf కూడాచేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ నుwww.vadderatimes. com లో డౌన్లోడ్స్ సెక్షన్ లో కూడా పెడుతున్నాను.

చదివి మీ అభిప్రాయాలనుతెలుపగలరు.

మీ సోదరి,

 జెరిపెటి చంద్రకళ

789 368 2052

www.vadderatimes.com

 

లింక్స్:

AP Assembly Segments Details:

  https://en.m.wikipedia.org/wiki/List_of_constituencies_of_Andhra_Pradesh_Legislative_Assembly

TS Assembly Segments Details:

https://en.m.wikipedia.org/wiki/List_of_constituencies_of_Telangana_Legislative_Assembly

Vaddera Times AP vaddera voters details link:

https://vadderatimes.com/te/articles/ap-vaivaidha-jailalaaalalaoonai-vadadaera-otarala-samkhaya-amcanaaalau

 

Download Category